యాంగ్జైటీ ఉంటే సెక్స్ లైఫ్ సంగతి అంతేనా?

First Published Jun 1, 2023, 10:48 AM IST

ప్రస్తుతం యాంగ్జైటీ తో బాధపడేవారు ఎక్కువయ్యారు. ఇది శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. యాంగ్జైటీ లైంగిక జీవితాన్ని కూడా ఎంతో ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
 

యాంగ్జైటీ మీరు అనుకున్నంత చిన్న సమస్య అయితే కాదు. ఎందుకంటే ఇది భావోద్వేగ, మానసిక, శారీరక శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. అంతేకాదు ఇది మీ భాగస్వామిని మీకు దూరం చేస్తుంది. యాంగ్జైటీ మీ లైంగిక జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. యాంగ్జైటీ భయాందోళన, భయం, ఉద్రిక్తత, అసౌకర్యం వంటి భావాలను ప్రేరేపిస్తుంది. ఇవన్నీ మీ ఆలోచనతో సహా మీ మొత్తం జీవితంలోని ఎన్నో అంశాలపై ఆధిపత్యం చెలాయిస్తాయి. ఇది మీ శృంగార భావాలకు కూడా ఆటంకం కలిగిస్తుంది. 
 

యాంగ్జైటీ మీ లైంగిక జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

యాంగ్జైటీతో జీవించడం అంటే మీరు ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా యాంగ్జైటీలోనే ఉంటారు. దానితోనే జీవిస్తున్నారు. యాంగ్జైటీ  ఉన్నప్పుడు మీరు సెక్స్ లో పాల్గొనలేరు. ఒకవేళ పాల్గొన్నా దాన్ని సంపూర్ణంగా ఆస్వాధించలేరు. యాంగ్జైటీ మీ మానసిక స్థితి, మీ లిబిడో పై ప్రభావం చూపుతుంది. యాంగ్జైటీ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయంటే? 

sex life

అంగస్తంభన లేకపోవడం
అకాల స్ఖలనం లేదా ఆలస్యంగా భావప్రాప్తిని పొందడం
యోనిస్మస్ - ఏదైనా ఒకరకమైన యోని చొచ్చుకుపోయే భయం 
లైంగిక వాంఛ తగ్గడం
సాన్నిహిత్యాన్ని నివారించే ధోరణులు పెరగడం

యాంగ్జైటీ మీ లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తుందనడానికి సంకేతాలు

ఆత్మవిశ్వాసం లేకపోవడం

యాంగ్జైటీ ఉన్నవారిలో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వారి శరీరాల గురించి, వారు ఎలా కనిపిస్తారోనని భయంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల మీ లైంగిక జీవితం ఎంతో ప్రభావితం అవుతుంది. 

సాన్నిహిత్యాన్ని నివారించడం

మీ భాగస్వామికి దగ్గరగా ఉన్నప్పుడు యాంగ్జైటీ చెందుతున్నారా? సెక్స్ చేయడం వల్ల ఆందోళన మరింత ఎక్కువవుతోందా? అయితే మీ సెక్స్ లైఫ్ చెడినట్టేనని సెక్సువల్ మెడిసిన్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం సూచిస్తోంది. 

కమ్యూనికేషన్ లేకపోవడం

అది సెక్స్ అయినా, ఇతరత్రా వేరే పనులైనా మీ భాగస్వామితో మీ బంధం బాగుండాలంటే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ మెరుగ్గా ఉండాలి. మీకు సహాయం చేయడానికి మీ భాగస్వామితో మాట్లాడండి. మీరు ఆత్రుతగా ఉన్నప్పుడు మీ ప్రియమైనవారితో మాట్లాడటం చాలా ముఖ్యం.
 

భావప్రాప్తి పొందలేకపోవడం

మీరు ఎంతకీ భావప్రాప్తి పొందలేకపోయారా? అయితే మీరు యాంగ్జైటీతో బాధపడుతున్నట్టే. యాంగ్టైటీ ఉన్నప్పుడు మీరు ఉద్వేగం పొందలేరని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆందోళన అనవసరమైన ఆలోచనలను పుట్టిస్తుంది. ఇది ఉద్వేగం భావాలకు మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. ఇలాంటి సమస్య మీకు ఉంటే వెంటనే డాక్టర్ తో మాట్లాడండి. 
 

తక్కువ లిబిడో

ఆత్రుతగా అనిపించడం వల్ల మీ లైంగిక జీవితం ఎంతో ప్రభావితం అవుతుంది. ఆత్రుతగా ఉన్నప్పుడు మీరు సెక్స్ చేసే మూడ్ లోకి రారు. యాంగ్జైటీ మీ లిబిడోను తగ్గిస్తుంది. ఇది సెక్స్ కోరికలను తగ్గిస్తుంది.
 

కొన్ని మందులు

యాంగ్జైటీకి మందులు తీసుకుంటున్నారా? అయితే కొన్ని మందులు కూడా మీ లైంగిక జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. హార్వర్డ్ హెల్త్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. యాంటి డిప్రెసెంట్స్ వంటి మందులు లైంగిక కోరికలను తగ్గిస్తాయి. లిబిడో కూడా తగ్గుతుంది. 
 

యాంగ్జైటీ ని తగ్గించడానికి ఏం చేయాలి? 

ప్రొఫెషనల్ తో మాట్లాడి సహాయం తీసుకోండి.
మీ సమస్య గురించి మీ భాగస్వామితో మాట్లాడండి. దీంతో వారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీకు సహాయపడతారు.
యాంగ్జైటీని తగ్గించుకోవడానికి హాస్పటల్ కు వెళ్లండి. 
 

click me!