High Protein Foods: శరీరానికి ప్రోటీన్ ఎంతో అవసరం. ఎముకలు బలపడటం, బరువు తగ్గడం, కండరాలు బలోపేతం కావడం వంటి ప్రయోజనాలు పొందడానికి గుడ్లను ఎక్కువగా తింటారు. కానీ, గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే సూపర్‌ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.
శరీరానికి అవసరమైన పోషకాలలో ప్రోటీన్ చాలా ముఖ్యమైనది. బరువు తగ్గడానికి, శరీరానికి శక్తినిచ్చేందుకు, కండరాలను బలోపేతం చేసేందుకు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చాలా మంది ప్రోటీన్ కోసం గుడ్లను తీసుకుంటారు. కానీ గుడ్ల మాదిరిగానే అధిక ప్రోటీన్ ఉన్న ఆహారాల గురించి ఈ పోస్ట్‌లో తెలుసుకుందాం.
26
క్వినోవా, బాదం
క్వినోవా లో ఫైబర్, ప్రోటీన్, ఇతర ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. 100 గ్రాముల క్వినోవాలో 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే బియ్యం, గోధుమలను తినేవారు, వాటికి బదులుగా ప్రోటీన్ అధికంగా ఉండే క్వినోవాను తీసుకోవచ్చు.
పప్పు ధాన్యాల్లో బాదం ప్రోటీన్ అధికంగా ఉంటుంది. 100 గ్రాముల బాదంలో 21 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. బాదం పప్పును వేయించి లేదా రాత్రంతా నానబెట్టి తినవచ్చు. ఓట్స్ లేదా స్మూతీలలో కలుపుకుని తినవచ్చు.
36
పీనట్ బటర్, చియా గింజలు
పీనట్ బటర్, చియా విత్తనాలు.. ప్రోటీన్‌తో పాటు శరీరానికి అవసరమైన మంచి కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అందించే సూపర్ ఫుడ్స్. 100 గ్రాముల పీనట్ బటర్‌లో 25 గ్రాముల ప్రోటీన్ ఉండగా, చియా విత్తనాల్లో 17 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. పీనట్ బటర్‌ను బ్రెడ్‌పై రాసుకుని లేదా స్మూతీలో కలిపి తినవచ్చు. చియా విత్తనాలను నీటిలో నానబెట్టి జ్యూస్, పెరుగు, ఓట్స్‌లో కలిపి తీసుకుంటే శక్తిని, తృప్తిని ఇస్తాయి. ఇవి బరువు తగ్గాలనుకునేవారికి, వ్యాయామం చేసే వారికీ ఇది బెస్ట్ ఆప్షన్ .
పాలను చిక్కబెట్టి దాని నుండి తయారు చేయబడినదే పన్నీర్. 100 గ్రాముల పన్నీర్‌లో 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. పన్నీర్‌ను సలాడ్‌తో కలిపి తినవచ్చు లేదా బ్రెడ్‌ల మధ్యలో ఉంచి శాండ్‌విచ్‌గా తినవచ్చు.
సోయాను నూరి దాని నుండి తీసిన పాలతో తయారు చేసిన పన్నీర్‌ను టోఫు అంటారు. దీన్ని ఉదయం అల్పాహారంలో తీసుకోవచ్చు. 100 గ్రాముల టోఫులో 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
56
పెరుగు
పెరుగు: 100 గ్రాముల పెరుగులో 10 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. పెరుగును పండ్లు లేదా సలాడ్‌లతో కలిపి తినవచ్చు. పెరుగులోని ప్రోబయోటిక్స్ ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ప్రేగులలో మంచి బాక్టీరియాను పెంచుతాయి.
ఓట్స్: ప్రోటీన్ తినాలనుకునేవారికి ఓట్స్ కూడా బెస్ట్ ఆప్షన్. 100 గ్రాముల ఓట్స్‌లో 17 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీన్ని ఉప్మాలా లేదా పండ్లతో కలిపి స్మూతీలా చేసుకుని తాగవచ్చు. ఉదయం అల్పాహారంగా ఓట్స్ తీసుకోవచ్చు.
66
సులభంగా లభించే ప్రోటీన్ ఆహారాలు
సులభంగా ప్రోటీన్ పొందగల ఆహారం గుడ్డు. 100 గ్రాముల గుడ్డులో సుమారు 13 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఉడికించిన లేదా ఆమ్లెట్ రూపంలో తినడం మంచిది. అయితే.,. సగం ఉడికించిన గుడ్డును తినడం మానుకోండి. వీటితో పాటు ఆకుకూరలు, పండ్లు, పాలు కలిపిన స్మూతీ తాగవచ్చు. వీటిలో 100 గ్రాముల్లో 70 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ అధికంగా ఉండే తృణధాన్యాలు, కూరగాయలను ఏ విధంగానైనా తీసుకోవచ్చు. ప్రోటీన్ ఆహారాలు శరీరానికి బలాన్ని ఇవ్వడమే కాకుండా చురుగ్గా ఉండటానికి కూడా సహాయపడతాయి.