Heart Health: మీ మెడ సైజ్‌ మీకు గుండె పోటు వ‌స్తుందో లేదో చెప్పేస్తుంది.

Published : Sep 24, 2025, 12:36 PM IST

Heart Health: హార్ట్ హెల్త్ గురించి మాట్లాడితే కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెజర్, వెయిట్ లేదా వెస్ట్ సైజ్ గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ తాజా పరిశోధనల ప్ర‌కారం మెడ చుట్టుకొలత కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాన్ని చెప్ప‌గ‌ల‌ద‌ని అంటున్నారు. 

PREV
15
మెడ సైజ్ ఎందుకు కీల‌కం.?

మెడ భాగంలో కొవ్వు.. శరీరానికి చాలా దగ్గరగా ఉండే రక్తనాళాలు, శ్వాసనాళాల చుట్టూ నిల్వ అవుతుంది. ఇది బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెజర్‌లో మార్పులు తీసుకురావచ్చు. ఇవన్నీ హార్ట్ సమస్యలకు ప్రధాన కారణాలు. అందుకే మెడలో ఎక్కువ కొవ్వు ఉండటం కేవలం చూడ‌డానికి బాగా క‌నిపించ‌డ‌మే కాకుండా, శరీర పనితీరుపై నేరుగా ప్రభావం చూపుతుంది.

25
షాంఘైలో నిర్వ‌హించిన అధ్య‌య‌నం

చైనాలోని షాంఘైలో 50 నుంచి 80 ఏళ్ల మధ్య వయసున్న 1,400 మందిని దాదాపు ఎనిమిదేళ్లు పరిశీలించారు. మెడ సైజ్ ఎక్కువగా ఉన్నవారిలో (పురుషులు 38.5 సెం.మీ పైగా, మహిళలు 34.5 సెం.మీ పైగా) హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ ఎక్కువగా వచ్చాయి. పురుషులలో ఈ రిస్క్ రెండు రెట్లు ఎక్కువగా కనిపించింది.

35
హై-రిస్క్ జనాభాలో మరో స్టడీ

మరో అధ్యయనంలో భాగంగా 12,000 మందికి పైగా హార్ట్ డిసీజ్ రిస్క్ ఉన్న వారిని దాదాపు తొమ్మిది సంవత్సరాలు ఫాలో అయ్యారు. మెడ పెద్దగా ఉన్నవారిలో కేవలం హార్ట్ అటాక్‌లు, స్ట్రోక్స్ మాత్రమే కాదు, మరణాల రేటు కూడా ఎక్కువగా నమోదైంది. పెద్ద మెడ సైజ్ ఉన్నవారిలో సర్వైవల్ రేట్ తక్కువగా ఉంది. ఈ స్టడీ ప్రకారం, మెడ సైజ్ పురుషులు, మహిళలు ఇద్దరికీ ప్రమాద సూచికగా ప‌రిగ‌ణిస్తున్నారు.

45
మెడ సైజ్ – ఒక అదనపు రెడ్ ఫ్లాగ్

రక్త పరీక్షలు, ECG, బ్లడ్ ప్రెజర్ లాంటి ప్రామాణిక చెకప్‌లకు ఇది ప్రత్యామ్నాయం కాదు. కానీ ఒక అదనపు హెచ్చరిక సంకేతంగా డాక్టర్లు దీన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. దీని ద్వారా శరీరంలో కొవ్వు పంపిణీ కూడా ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. ఇద్దరికి ఒకే BMI ఉన్నా, ఎవరి మెడ/వెస్ట్ వద్ద ఎక్కువ కొవ్వు ఉంటే వారికి ప్రమాదం ఎక్కువ ఉన్న‌ట్లు.

55
తరచూ కొలవాలా?

కొంత మంది డాక్టర్లు కొన్ని ర‌కాల హెల్త్ చెక‌ప్స్‌లో భాగంగా మెడ సైజ్ కూడా కొల‌వ‌డం మొద‌లు పెట్టారు. అయితే, ఇది స్టాండర్డ్ మెజర్‌మెంట్‌గా మారడానికి మరిన్ని పరిశోధనలు అవసరమ‌ని చెబుతున్నారు. ప్రస్తుతానికి ఇది కేవలం సపోర్టివ్ ఇండికేటర్, అంతే కానీ డయాగ్నోసిస్ టూల్ కాదని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. దీనిని ప్రాణామికంగా భావించకూడదు. 

Read more Photos on
click me!

Recommended Stories