వేసవిలో తాటి ముంజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

Published : May 13, 2025, 08:46 AM IST

Ice Apple : వేసవికాలంలో చాలామంది తాటి ముంజలు తినడానికి ఇష్టపడుతారు. రోడ్ల మీద, మార్కెట్లలో వీటికి డిమాండ్ ఎక్కువ. తాటి ముంజలు తియ్యగా, రుచిగా ఉంటాయి. తాటి ముంజల్లో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల డీహైడ్రేషన్ బారి నుంచి తప్పించుకోవచ్చు. తాటి ముంజల్లో విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్, కాల్షియం, జింక్, పొటాషియం ఉన్నాయి. తాటి ముంజలతో ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.  

PREV
17
వేసవిలో తాటి ముంజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?
వేసవిలో తాటి ముంజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

పోషకాహార గైడ్:  

ఐస్ ఆపిల్, ఒక రిఫ్రెషింగ్ వేసవి పండు, పోషకాలతో నిండిన సహజ శీతలకారి. తక్కువ కేలరీలు మరియు హైడ్రేషన్‌తో కూడిన ఇది వేడి మరియు తేమతో కూడిన వాతావరణాలకు అనువైన అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

27
హైడ్రేట్

తాటి ముంజాల్లో అధిక నీటి శాతం ఉంటుంది. ఇవి తినడం వల్ల శరీరం  డీహైడ్రేషన్‌ కాకుండా నివారిస్తుంది. శరీరాన్ని సహజంగా చల్లబరుస్తుంది. చెమట ద్వారా కోల్పోయిన ముఖ్యమైన ఎలక్ట్రోలైట్‌లను తిరిగి వీటి ద్వారా పొందవచ్చు.  

37
పోషకాలతో సమృద్ధి

పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. విటమిన్లు A, C మరియు పొటాషియం, కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాలు తాటి ముంజాల్లో ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఎముకల ఆరోగ్యానికి సహయపడుతాయి. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 

47
జీర్ణక్రియకు మేలు

తాటిముంజాలు మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతాయి. ఇవి జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. వీటి సహజ శీతలీకరణ ప్రభావం కారణంగా మలబద్ధకం, ఆమ్లత్వాన్ని తగ్గిస్తుంది.

57
సహజ శీతలకారి

తాటిముంజాలు సహజ శీతలీకరణకు ఉపయోగపడుతాయి. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. ముఖ్యంగా వేసవి కాలంలో వచ్చే చర్మ దద్దుర్లను తగ్గించడంలో సహాయపడుతుంది.

67
వెయిట్ లాస్

తక్కువ కేలరీలు, నీరు, ఫైబర్స్ ఉన్న తాటిముంజలు కడుపులో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీవక్రియకు తోడ్పడుతుంది. 

77
చర్మ సమస్యలకు చెక్

చర్మ సమస్యలకు చెక్ పెట్టడంలో తాటిముంజలు సహాయపడుతాయి. దాని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వేసవిలో వేడి దద్దుర్లు, మొటిమలను నయం చేయడంలో సహాయపడతాయి.

Read more Photos on
click me!

Recommended Stories