Health: ఉదయం నిద్రలేచిన వెంటనే నీటిని తాగాలని నిపుణులు చెబుతుంటారు. పరగడపున నీరు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయని అంటారు. ఇంతకీ ఉదయం నీరు తాగితే జరిగే లాభాలు ఏంటి.? ఎలాంటి వారు నీరు తాగకూడదు.? ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రి నిద్ర సమయంలో శరీరం చాలాసేపు నీటికి దూరంగా ఉంటుంది. దీంతో శరీరంలో నీటి లోపం ఏర్పడుతుంది. అంటే బాడీలో టెంపరరీగా డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. ఉదయం లేచిన వెంటనే ఒకటి రెండు గ్లాసుల నీరు తాగితే శరీరం మళ్లీ హైడ్రేట్ అవుతుంది. అవయవాలు సరిగ్గా పనిచేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
26
మెటబాలిజం వేగంగా పని చేస్తుంది
ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల మెటబాలిజం యాక్టివ్ అవుతుంది. దీని ప్రభావంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. బరువు నియంత్రణలో కూడా ఇది సహాయపడుతుంది. రోజంతా అలసట తక్కువగా ఉంటుంది.
36
టాక్సిన్స్ బయటకు వెళ్లేందుకు సహాయం
నిద్ర సమయంలో శరీరం లోపల క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ సమయంలో కొన్ని వ్యర్థ పదార్థాలు పేరుకుపోతాయి. ఉదయం నీరు తాగితే మూత్రం ద్వారా అవి బయటకు వెళ్లిపోతాయి. కిడ్నీలు బాగా పని చేయడానికి ఇది తోడ్పడుతుంది.
ఉదయం నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మేల్కొంటుంది. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. కడుపు భోజనం తీసుకునేందుకు సిద్ధమవుతుంది. పోషకాలు శరీరంలోకి బాగా చేరుతాయి.
56
చర్మం, మెదడు ఆరోగ్యం మెరుగవుతుంది
సరిపడా నీరు తాగితే చర్మం తేమగా ఉంటుంది. ముఖంపై సహజ కాంతి కనిపిస్తుంది. ముడతలు ఆలస్యంగా వస్తాయి. మెదడులో ఎక్కువ భాగం నీటితోనే ఉంటుంది కాబట్టి ఉదయం నీరు తాగితే ఏకాగ్రత పెరుగుతుంది. ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి.
66
ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
నిపుణుల అభిప్రాయం ప్రకారం చాలా మందికి ఉదయం నీరు తాగడం మంచిదే. అయితే కిడ్నీ సమస్యలు, హార్ట్ ఫెయిల్యూర్, తీవ్రమైన యాసిడ్ రిఫ్లక్స్, శరీరంలో వాపు సమస్య వంటివి ఉన్న వారు మాత్రం డాక్టర్ సలహా తీసుకుంటే మంచిది. ఇక ఉదయం గోరువెచ్చని నీరు తాగితే ప్రయోజనం ఇంకా ఎక్కువగా ఉంటుంది.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.