Health: 30 ఏళ్ల‌లో హైబీపీ వ‌స్తే దేనికి సంకేత‌మో తెలుసా.? వెంట‌నే అల‌ర్ట్ అవ్వాల్సిందే..

Published : Jan 29, 2026, 12:23 PM IST

Health: ర‌క్త‌పోటు ఇటీవ‌ల స‌ర్వ‌సాధార‌ణంగా మారిపోయింది. ఒక‌ప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో మాత్ర‌మే క‌నిపించిన ఈ స‌మ‌స్య ఇప్పుడు 30 ఏళ్ల‌లో కూడా వ‌స్తోంది. అయితే త‌క్కువ వ‌య‌సులో బీపీ దేనికి సంకేత‌మో తెలుసా.? 

PREV
15
30 ఏళ్లకే హై బీపీ.. ఇది సాధారణమా?

ఒకప్పుడు హై బీపీ అనేది వృద్ధుల సమస్యగా భావించేవారు. 50 లేదా 60 ఏళ్ల తర్వాతే వస్తుందన్న అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 20–30 ఏళ్ల వయసులోనే చాలామందికి హై బీపీ కనిపిస్తోంది. ఇంకా ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, చాలా మందికి తమకు హై బీపీ ఉందనే విషయం కూడా తెలియదు. హై బీపీకి లక్షణాలు పెద్దగా కనిపించవు. లోపలే నెమ్మదిగా శరీరాన్ని దెబ్బతీస్తుంది. అందుకే దీనిని ‘సైలెంట్ కిల్లర్’ అంటారు.

25
హై బ్లడ్ ప్రెషర్ అంటే ఏమిటి?

మన శరీరంలో రక్తం ధమనులలో ప్రవహిస్తుంది. ఆ రక్తం గోడలపై ఎక్కువ ఒత్తిడి పడితే దానినే హై బ్లడ్ ప్రెషర్ లేదా హైపర్‌టెన్షన్ అంటారు. బీపీ రీడింగ్ రెండు సంఖ్యలతో చెబుతారు. సిస్టోలిక్ ప్రెషర్ – గుండె రక్తాన్ని పంపే సమయంలో. డయాస్టోలిక్ ప్రెషర్ – గుండె విశ్రాంతిలో ఉన్న సమయంలో. సిస్టోలిక్ బీపీ 130- 140 mmHg కంటే ఎక్కువగా ఉంటే లేదా డయాస్టోలిక్ బీపీ 90 mmHg కంటే ఎక్కువగా ఉంటే అది హై బీపీగా పరిగణిస్తారు.

35
30 ఏళ్ల వయసులో హై బీపీ రావడం ప్రమాదకరమేనా?

30 ఏళ్ల వయసులో హై బీపీని సాధారణంగా తీసుకోకూడదు. ఇది జీవనశైలి తప్పు దారిలో ఉందన్న సంకేతం. శరీరం లోపల తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది అని అర్థం. ఇలాగే కొన‌సాగితే భవిష్యత్తులో గుండెపోటు, స్ట్రోక్,• కిడ్నీ సమస్యలు, చూపు తగ్గడం లాంటి ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ త‌ర‌చూ బీపీ పరీక్ష చేయించుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా హై బీపీ ఉంటే మరింత జాగ్రత్త అవసరం.

45
యువతలో హై బీపీ పెరగడానికి ప్రధాన కారణాలు

నేటి జీవన విధానం హై బీపీకి ప్రధాన కారణంగా మారింది. గంటల తరబడి మొబైల్, ల్యాప్‌టాప్ వాడకం, రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం, శారీరక వ్యాయామం లేకపోవడం, ఉద్యోగ ఒత్తిడి, ఆర్థిక టెన్షన్, ఎప్పుడూ మానసిక ఒత్తిడిలో ఉండటం. ఇలాంటి పరిస్థితుల వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి. అవే బీపీని పెంచుతాయి.

55
ఆహారం, అలవాట్లు కూడా హై బీపీకి కారణమే

ఇప్పటి ఆహారపు అలవాట్లు హై బీపీని నెమ్మదిగా పెంచుతున్నాయి. ఎక్కువ ఉప్పు, ఫాస్ట్ ఫుడ్, ప్యాకెట్ స్నాక్స్, కూల్ డ్రింక్స్‌. ఇవి శరీరానికి హాని చేస్తాయి. బరువు పెరిగితే గుండె ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. దాంతో బీపీ పెరుగుతుంది. పొట్ట చుట్టూ కొవ్వు ఉండటం హై బీపీకి పెద్ద సంకేతం. సిగరెట్, పొగాకు,  ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తనాళాలు గట్టిపడతాయి. గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. నిద్ర కూడా చాలా ముఖ్యం. రోజుకు 8 గంట‌ల నిద్ర కచ్చితంగా ఉండాలి.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాలు కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారం మేర‌కు మాత్ర‌మే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచ‌న‌లు పాటించ‌డ‌మే ఉత్త‌మం.

Read more Photos on
click me!

Recommended Stories