చాలామంది ఎండ కాలంలో టోపీలు వాడుతుంటారు. ఎండ వేడి నుంచి తలను, జుట్టుని కాపాడుకోవడానికి టోపీలు పెట్టుకుంటారు. కానీ ఎక్కువసేపు టోపీ పెట్టుకుంటే జుట్టు పాడవుతుందనే సందేహం చాలామందిలో ఉంటుంది. దానిలో నిజమెంతో ఇక్కడ తెలుసుకుందాం.
టోపీ ఎక్కువసేపు పెట్టుకుంటే జుట్టు రాలుతుందనడంలో వాస్తవం ఉందని నిపుణులు చెబుతున్నారు. టోపీని సరిగ్గా పెట్టుకోకపోతే జుట్టు ఊడటమే కాదు కొన్నిసార్లు బట్టతల కూడా వస్తుందని హెచ్చరిస్తున్నారు. అయితే దాన్ని ఎలా నివారించాలో ఇక్కడ చూద్దాం.
టోపీ పెట్టుకుంటే జుట్టు ఎందుకు ఊడుతుంది?
ఎండాకాలంలో టోపీ పెట్టుకోవడం కామన్ అయినా, టోపీని సరిగ్గా పెట్టుకోకపోతే జుట్టు ఊడటం, బట్టతల వచ్చే ప్రమాదం ఉందట. రోజుకి కొన్ని వెంట్రుకలు ఊడటం సాధారణమే కానీ, 100 వెంట్రుకల కంటే ఎక్కువ ఊడితే జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కువసేపు టోపీ పెట్టుకుంటే జుట్టులో చెమట ఎక్కువై, నెత్తి మీద బ్యాక్టీరియా చేరుతుంది. దీనివల్ల జుట్టు తొందరగా ఊడిపోతుంది. అలాగే మీరు మురికిగా టోపీ పెట్టుకుంటే నెత్తికి ఇన్ఫెక్షన్ సోకి జుట్టు ఊడిపోతుంది. కాబట్టి మీరు మురికి టోపీ పెట్టుకోవడం, ఎక్కువసేపు టోపీ పెట్టుకోవడం మానేస్తే జుట్టు ఊడకుండా కాపాడుకోవచ్చు.
టైట్ గా ఉండే టోపీ పెట్టుకోకండి!
మీరు టోపీని టైట్ గా పెట్టుకోవడం కూడా మానేయాలి. టోపీని టైట్ గా పెట్టుకుంటే జుట్టుని లాగినట్టు అయి తెగిపోతుంది. టోపీ టైట్ గా పెట్టుకోవడం వల్ల చెమట ఎక్కువ పట్టి జుట్టుకి ఇన్ఫెక్షన్ వస్తుంది. దీనివల్ల తలనొప్పి కూడా వస్తుంది. కాబట్టి మీ తలకి సరిపోయే టోపీ మాత్రమే పెట్టుకోండి. అలాగే వేరేవాళ్ల టోపీని ఎప్పుడూ పెట్టుకోకూడదు. దీనివల్ల జుట్టు ఊడటం, నెత్తికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
టోపీ పెట్టుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సినవి:
- మీరు పెట్టుకునే టోపీ శుభ్రంగా ఉండాలి అప్పుడే జుట్టు ఊడకుండా ఉంటుంది.
- జుట్టు ఊడకుండా ఉండాలంటే జుట్టు తడిగా ఉన్నప్పుడు టోపీ పెట్టుకోకండి. దీనివల్ల జుట్టులో తేమ ఉండిపోయి చెమటతో కలిసి జుట్టు ఊడటాన్ని పెంచుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.
- ఎండా వేడి నుంచి జుట్టుని కాపాడుకోవాలంటే కాటన్ టోపీని వాడండి. కాటన్ వేడిని పీల్చుకుంటుంది. దీనివల్ల చెమట పట్టదు.
- ముఖ్యంగా ఎక్కువసేపు టోపీ పెట్టుకోవడం మానేయాలి. లేదంటే చెమట వల్ల నెత్తి మీద బ్యాక్టీరియాలు పెరుగుతాయి.