1 . ఆకుకూరలు బాగా తినండి . . కాయగూరలు, పళ్ళు , నట్స్..
తినే ఫుడ్ లో ఇవి యాభై శాతం ఉండాలి. మరో 30 శాతం దాక ప్రోటీన్.
సింపుల్ కార్బ్స్ తినొద్దు. అంటే మైదా వద్దు . బ్రెడ్స్, నాన్, పుల్కా వద్దు.
తెల్లన్నం తగ్గించండి. రాగులు, జొన్నలు మంచిది. అలాగే సిరి ధాన్యాలు కూడా.
2 . రోజూ స్రీలు మూడు లీటర్లు, పురుషులు నాలుగు లీటర్ల నీరు తాగాలి.
3 . ఒమేగా త్రి ఫాటీ ఆసిడ్స్ బాడీకి ఇవ్వండి . సముద్రపు చేపలు. వాల్ నట్స్ లో ఇవి ఎక్కువగా ఉంటాయి.
అలాగే యాంటి ఆక్సిడెంట్స్ కూడా . బెర్రీస్, ఆకుకూరల్లో ఇవి సమృద్ధిగా ఉంటాయి.
4 . ప్రతిరోజు ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర తప్పనిసరి.
5 . వంటకాల్లో పసుపు, అల్లం బాగా వాడండి.
6 . డి వింటమిన్ కోసం ఎండ శరీరానికి తాకాలి
7 వ్యాయామం... నడక, యోగా, జిమ్.