వర్కౌట్ తర్వాత తినకూడని ఆహారాలు
మనం ఆరోగ్యంగా ఉంటే ఏ రోగం లేకుండా హాయిగా బతకొచ్చు. అందుకే చాలామంది రోజూ వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకుంటారు. అయితే వ్యాయామం చేసిన తర్వాత కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తినకూడదని ఎక్సర్‌సైజ్ నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసా?
వర్కౌట్ తర్వాత మాంసాహారం తినొద్దు!
బరువు తగ్గడానికి జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేస్తుంటే, వ్యాయామం చేసిన తర్వాత మాంసాహారం తినడం మంచిది కాదని గుర్తుంచుకోండి. వ్యాయామం చేసిన తర్వాత ఆకలిగా ఉంటే వెంటనే చిప్స్, ఫ్రైడ్ రైస్ లాంటి వేయించిన పదార్థాలు తినకండి. ఎందుకంటే వాటిలో నూనె శాతం ఎక్కువ ఉంటుంది.
వర్కౌట్ తర్వాత కూల్ డ్రింక్స్ తాగొద్దు!
వ్యాయామం చేశాక దాహంగా ఉంటే ఎప్పుడూ చల్లటి పానీయాలు తాగకండి. బదులుగా చక్కెర కలపని పండ్ల జ్యూస్‌లు తాగొచ్చు. వ్యాయామం చేసిన వెంటనే జంక్ ఫుడ్ తినడం మానేయాలి. లేదంటే జిమ్‌కి వెళ్లి కష్టపడి వ్యాయామం చేసినా ఫలితం ఉండదు.