ప్రతిరోజు ఒక గ్లాస్ బాదం పాలు తాగితే ఏమవుతుందో తెలుసా?

Published : Aug 29, 2025, 03:50 PM IST

బాదం పాలు రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా మంచివి కాబట్టి.. చాలామంది వీటిని ఇష్టంగా తాగుతారు. బాదం పాలు ఎన్నో పోషక గుణాలను కలిగి ఉంటాయి. ప్రతిరోజు వీటిని తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.  

PREV
15
బాదం పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

బాదం పాలలో విటమిన్లు, ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. బాదం పప్పును నేరుగా తినడం కంటే బాదం పాలు తయారు చేసుకొని తాగడం మంచిదని చెబుతుంటారు నిపుణులు. బాదం పాలు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

25
మెరుగైన జీర్ణక్రియ

బాదం పాలు శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, మినరల్స్ ని అందిస్తాయి. బాదం పాలలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. అంతేకాదు ఎముకల ఆరోగ్యానికి కావాల్సిన కాల్షియం బాదం పాలలో పుష్కలంగా ఉంటుంది. వీటిని తాగడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.  

35
మెదడు ఆరోగ్యానికి..

బాదం పాలల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ E ఉంటాయి. ఇవి మెదడు అభివృద్ధికి, జ్ఞాపకశక్తి పెరగడానికి సహాయపడతాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు, విద్యార్థులు బాదం పాలు తాగడం ద్వారా ఏకాగ్రత పెంచుకోవచ్చు. 

45
గుండె ఆరోగ్యానికి..

ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన బాదం పాలు.. కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఈ పాలలోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. అంతేకాదు బాదం పాల గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కూడా వీటిని మితంగా తాగవచ్చు.  

55
మెరుగైన నిద్ర

బాదంలోని మెగ్నీషియం, ట్రిప్టోఫాన్ మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. మెరుగైన నిద్రకు సహాయపడతాయి. అంతేకాదు బాదం పాలు తాగడం వల్ల చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. 

ఒక కప్పు బాదం పాలలో 39 కేలరీలు ఉంటాయి. వీటిని తాగడం ద్వారా ఆకలి తగ్గుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. బాదం పాలలోని యాంటీఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడి క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 

Read more Photos on
click me!

Recommended Stories