వింట‌ర్‌లో ర‌మ్ తాగితే శ‌రీరం వేడేక్కుతుందా.? ఇందులో నిజ‌మెంతంటే..

Published : Nov 30, 2025, 02:05 PM IST

Fact: చ‌లి పంజా విసురుతోంది. ఉష్ణోగ్ర‌త‌లు భారీగా త‌గ్గుతున్నాయి. దీంతో కొంద‌రు మ‌ద్యం ప్రియులు ఒక పెగ్ ర‌మ్ వేస్తే శ‌రీరం వేడెక్కుతుంది అని చెబుతుంటారు. మ‌రి నిజంగానే ర‌మ్ తాగితే శ‌రీరం వేడిగా మారుతుందా.? ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
శ‌రీరం వేడెక్కడం నిజ‌మే కానీ..

చలికాలంలో రమ్, బ్రాండి తాగితే శరీరం వేడెక్కిందని అనిపిస్తుంది. కానీ ఈ వేడి శరీరం ఉత్పత్తి చేసే అసలు వేడి కాదు. ఇది కేవలం శరీరంలో రక్తనాళాల స్పందన మాత్రమే. కొద్దిసేపు వేడిగా అనిపించినా, శరీరం వాస్తవంగా చల్లబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

25
రక్తనాళాల విస్తరణ వల్ల వచ్చే తాత్కాలిక వేడి

రమ్ తాగిన వెంటనే రక్తనాళాలు విస్తరిస్తాయి. దీంతో రక్త ప్రవాహం చర్మంపై పెరుగుతుంది. ఈ ప్రవాహం వల్ల శరీరం వేడెక్కిందనే భావన కలుగుతుంది. ఈ ప్రభావం కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది.

35
యూరప్ దేశాల్లో పాత నమ్మకం

యూరప్ వంటి ప్రాంతాల్లో చలికాలంలో మద్యం తాగే ఆచారం చాలా కాలం నుంచి ఉంది. శరీరాన్ని వేడిగా ఉంచుతుందనే అపోహతో ఈ పద్ధతి కొనసాగుతోంది. కంపెనీలు కూడా ఇదే భావనతో ప్రకటనలు చేస్తుంటాయి. అయితే ఇది శాస్త్రీయంగా సరైనది కాదు.

45
శరీరం లోపలి ఉష్ణోగ్రత తగ్గే ప్రమాదం

మద్యం తాగినప్పుడు రక్తనాళాలు విస్తరించడంతో లోపలి వేడి బయటకు పోతుంది. గాలి ద్వారా ఆ వేడి బయటికి వెళ్లిపోవటం వల్ల శరీరం లోపల చలిగా మారుతుంది. తాత్కాలిక వేడి అనిపించినా, లోపలి ఉష్ణోగ్రత తగ్గిపోవటం మాత్రం నిజం.

55
రమ్ తాగితే వేడి వస్తుందనేది కేవలం అపోహ

రమ్, బ్రాండి తాగితే శరీరం చలి నుంచి కాపాడుకుంటుందనేది అసలు నిజం కాదు. దీన్ని ఎక్కువకాలం అలవాటు చేసుకుంటే శరీరం వేడి నియంత్రణ సామర్థ్యం కూడా తగ్గుతుంది. ఆరోగ్యానికి కూడా హానికరం. కాబట్టి చలికాలంలో వేడి కోసం సహజమైన మార్గాలు – గోరువెచ్చని నీరు, వేడి ఆహారం, సరైన దుస్తులు ఉపయోగించటం ఉత్తమం.

Read more Photos on
click me!

Recommended Stories