Egg: గుడ్డులోని ఏ భాగంలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి?

Published : Jul 07, 2025, 09:02 AM IST

Egg Health Benefits : గుడ్డు సంపూర్ణ ఆహారం. ఇందులో శరీరానికి అవసరమైన ప్రొటీన్ పుష్కలంగా లభిస్తుంది. రోజూ ఒక గుడ్డు తింటే మన శరీరానికి ఎన్నో రకాలు పోషకాలు లభిస్తాయి. అయితే.. గుడ్డులోని ఏ భాగంలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది? వివరంగా తెలుసుకుందాం..

PREV
17
చౌకగా లభించే సంపూర్ణ ప్రోటీన్ ఆహారం

గుడ్డు..  ప్రోటీన్ అధిక మొత్తంలో ఉన్న ఆహారం. ప్రోటీన్‌తో పాటు మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు అందుతాయి.  పిల్లల నుంచీ పెద్దల వరకు అందరికీ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం. చౌకగా, సులభంగా లభించే ఈ పోషకాహారాన్ని ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటే శరీర దృఢత్వానికి ఎంతో ఉపయోగపడుతుంది.

27
గుడ్డులోని ఏ భాగంలో ఎక్కువ ప్రోటీన్ ?

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గుడ్డులోని తెల్లసొన, పచ్చసొన రెండూ శరీరానికి మేలు చేస్తాయి. తెల్లసొనలో అధికంగా ఉండే ప్రోటీన్ కండరాల నిర్మాణానికి తోడ్పడుతుంది, పచ్చసొనలో విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండటంతో శరీరానికి సంపూర్ణ పోషణను అందిస్తుంది. అందువల్ల, ఈ రెండు భాగాలను కలిపి తినడం ఆరోగ్యానికి ఉత్తమం.

37
తెల్లసొనలో

గుడ్డు తెల్లసొనలో ప్రధానంగా అల్బుమిన్ అనే అత్యంత నాణ్యత గల ప్రోటీన్ ఉంటుంది.  ఇది కండరాల నిర్మాణం, శరీర మరమ్మతులకు ఎంతో కీలకం. గుడ్డు పచ్చసొనలో మాత్రం విటమిన్లు A, D, E, K, B, ఐరన్, జింక్, భాస్వరం వంటి ఖనిజాలతో పాటు, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి.  

47
ముఖ్యమైన పోషకాలు

గుడ్డు తెల్లసొన, పచ్చసొన రెండూ శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి.  కాబట్టి, రెండు భాగాలను కలిపి తినడం వల్ల శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు లభిస్తాయి.

57
బరువు తగ్గడానికి

బరువు తగ్గాలనుకునే వారు గుడ్డులోని  తెల్లసొనను తినడం మంచిది. ఎందుకంటే ఇందులో కొవ్వు ఉండదు. కానీ, ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అయితే, మొత్తం శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారు, శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు అందుకునేందుకు తెల్లసొనతో పాటు పచ్చసొనను కూడా తీసుకోవాలి.

67
చర్మం, కండరాలకు మేలు

గుడ్డు తెల్లసొన చర్మాన్ని బిగుతుగా ఉంచడంలో, మొటిమలు, ముడతలు తగ్గించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో, ఇందులో ఉండే అల్బుమిన్ ప్రోటీన్ శరీరంలో కండరాల నిర్మాణానికి తోడ్పడుతుంది. అందుకే, వ్యాయామం చేసేవారికి గుడ్డు బెస్ట్ ఛాయిస్.

77
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది

ఈ రోజుల్లో చాలామంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ప్రతి రోజూ ఒక గుడ్డు తినడం వలన ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. గుడ్డు తెల్లసొనలో ఉండే పొటాషియం రక్తపోటును సమతుల్యం చేయడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.  

Read more Photos on
click me!

Recommended Stories