గోరు వెచ్చని నీటితో స్నానం
వేసవిలో అధిక చెమట సమస్యని తగ్గించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, యాంటీ బాక్టీరియల్ సబ్బు వాడటం, వేప నీటితో శరీరాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చెమట దుర్వాసన తగ్గుతుంది. ఎక్కువ నీరు తాగాలి. ధ్యానం, యోగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
వేపతో ఉపశమనం
వేప నీటిని చెమట ఎక్కువగా పట్టే చోట రాసుకుంటే బాక్టీరియా, దుర్వాసన తగ్గుతాయి. ప్రతిరోజూ స్నానం చేసేటప్పుడు వేప నీరు వాడటం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. స్నానం చేసే నీళ్లలో రోజూ వేప ఆకులు వేసుకొని నెలరోజులు స్నానం చేయాలి.
ఎక్కువ నీరు తాగండి
వేసవిలో ధ్యానం, యోగా వంటివి చేయడం వల్ల ఒత్తిడి తగ్గి చెమట సమస్య తగ్గుతుంది. శరీరం చల్లగా ఉంటుంది. వేసవిలో ఎక్కువ నీరు తాగితే శరీరం నుంచి అదనపు సోడియం బయటకి వెళ్లిపోతుంది. చెమట సమస్య తగ్గుతుంది.
చెమట పట్టే చోటు శుభ్రంగా
వేసవిలో చెమట వల్ల బాక్టీరియా, ఫంగస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చెమట పట్టే చోటు శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. దుర్వాసన రాదు. వేసవిలో లైట్ కలర్, కాటన్ డ్రెస్ వేసుకోవాలి. ఒకే డ్రెస్ రెండు సార్లు వేసుకోకూడదు. లోదుస్తులు శుభ్రంగా ఉంచుకోవాలి. వేసవిలో శరీరం చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఐస్ లేదా చల్లటి నీటితో స్నానం చేయవచ్చు. దీనివల్ల శరీరం చల్లగా, ఫ్రెష్ గా ఉంటుంది.