Sabja Water: ఎండాకాలంలో సబ్జా వాటర్ తాగితే బరువు తగ్గుతారా?

Published : Mar 04, 2026, 01:52 PM IST

Sabja Water: ఎండాకాలం వచ్చిందంటే శరీరం కూల్ గా ఉంచేందుకు రకరకాల డ్రింక్స్ తాగుతూ ఉంటారు. అలాంటి వాటిలో సబ్జా వాటర్ ఒకటి. అయితే ఈ మధ్య కాలంలో ఇది వెయిట్ లాస్ డ్రింక్‌గా ట్రెండ్ అవుతోంది. మరి నిజంగా సబ్జా వాటర్ తాగితే బరువు తగ్గుతారా? 

PREV
15
శరీరం చల్లగా ఉండాలంటే బెస్ట్ డ్రింక్

సమ్మర్ లో ఎవరైనా సరే డీహైడ్రేషన్ అవ్వడం పక్కా. బాడీ వేడెక్కిపోవడం, యూరిన్ మంట, కడుపుమంట, తలనొప్పి రావడం సహజం. ఎంత నీళ్లు తాగినా కూడా శరీరం కూల్ అవ్వదు. అందుకని బయట దొరికే రకరకాల డ్రింక్స్ తాగేస్తారు. కానీ ఇంట్లోనే ఉన్న బెస్ట్ రెమిడీస్ మర్చిపోతాం. అలాంటి వాటిలో సబ్జా వాటర్ ఒకటి. సబ్జా గింజలను నీటిలో నానబెట్టి తాగడం ఎప్పటినుంచో ఉంది. అయితే ఇప్పుడు బరువు తగ్గేందుకు సబ్జా గింజలను ఫుడ్ లో భాగం చేసుకుంటున్నారు. సబ్జా వాటర్ తాగితే నిజంగానే బరువు తగ్గుతారా? అదెలా..?

25
సబ్జాతో వెయిట్ లాస్..!

సబ్జా గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ గింజలు నీటిలో నానబెట్టినప్పుడు ఉబ్బి జెల్‌లా మారుతాయి. ఈ జెల్ రూపంలోని ఫైబర్ కడుపులో ఎక్కువసేపు ఉండి ఆకలిని నియంత్రిస్తుంది. దీంతో మధ్యలో తినే అలవాటు తగ్గుతుంది. తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల బరువు తగ్గడంలో సహాయం కలుగుతుంది. అందుకే సబ్జా వాటర్‌ను డైట్‌లో భాగంగా చేర్చుకుంటే ప్రయోజనం ఉంటుంది.

35
సపోర్ట్ డ్రింక్ మాత్రమే

సబ్జా గింజలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఎండాకాలంలో మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సబ్జా వాటర్ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. శరీరంలో టాక్సిన్స్ బయటకు వెళ్లేందుకు సహాయపడుతుంది. ఇవన్నీ కలిసి మెటబాలిజం మెరుగుపడటానికి దోహదం చేస్తాయి.

అయితే సబ్జా వాటర్ ఒక్కటే తాగితే బరువు త్వరగా తగ్గిపోతుందనుకోవడం పొరపాటు. ఇది ఒక సపోర్ట్ డ్రింక్ మాత్రమే. సరైన ఆహార నియమాలు పాటించకపోతే లేదా వ్యాయామం చేయకపోతే ఫలితం కనిపించదు. రోజువారీ డైట్‌లో తక్కువ నూనె, నో చక్కెర, సమతుల్య ఆహారం ఉండాలి. అలాగే రోజుకు కనీసం 30 నిమిషాలు నడక లేదా వ్యాయామం చేయాలి.

45
సబ్జా వాటర్ ఎలా తీసుకోవాలి?

ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ సబ్జా గింజలు వేసి 15–20 నిమిషాలు నానబెట్టాలి. అవి పూర్తిగా ఉబ్బిన తర్వాత తాగాలి. ఉదయం ఖాళీ కడుపుతో లేదా మధ్యాహ్నం ముందు తాగితే మంచిది. కావాలంటే కొద్దిగా నిమ్మరసం కలిపి తాగవచ్చు.

55
ఎక్కువగా తీసుకుంటే కడుపు ఉబ్బరం

అయితే జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. రోజుకు 1–2 టీస్పూన్లకంటే ఎక్కువ తీసుకోవద్దు. ఎక్కువగా తీసుకుంటే కడుపు ఉబ్బరం కలగవచ్చు. థైరాయిడ్, షుగర్ వంటి సమస్యలు ఉన్నవారు లేదా గర్భిణీలు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి.

ఎండాకాలంలో సబ్జా వాటర్ శరీరానికి కూలింగ్ ఇస్తుంది.దీంతో సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇది ఆకలి నియంత్రణలో సహాయపడుతూ బరువు తగ్గడంలో సపోర్ట్ చేస్తుంది. కానీ సరైన డైట్ ఉంటేనే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories