Malaika Arora Fitness: 52 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా ఉండే నటి మలైకా అరోరా తన బ్యూటీ సీక్రెట్‌ను పంచుకున్నారు. తన గట్ హెల్త్ (జీర్ణవ్యవస్థ ఆరోగ్యం) కోసం ప్రతిరోజూ ఉదయం తాగే ఒక సింపుల్ డ్రింకే తన ఫిట్‌నెస్‌కు కారణమని ఆమె వెల్లడించారు.
వయసు 52 అయినా నటి మలైకా అరోరా ఇప్పటికీ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నారు. శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢంగా ఉండటం వల్లే ఇది సాధ్యమైంది.
26
యోగా, వర్కౌట్‌తో పాటు ఈ డ్రింక్
ఏళ్లుగా మలైకా యోగా, ధ్యానం, వర్కౌట్లు చేస్తున్నారు. అవే ఆమె ఫిట్‌నెస్‌కు కారణం. వాటితో పాటు సరైన డైట్ కూడా ఆమె అందానికి, ఆరోగ్యానికి ముఖ్యమని చెప్పొచ్చు.
36
గట్ సమస్యలే అనారోగ్యానికి కారణం
గట్ హెల్త్ అంటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యం గురించి చాలామంది డాక్టర్లు చెబుతుంటారు. మన అనారోగ్యాలకు ప్రధాన కారణం ఇదే. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతక వ్యాధులు కూడా రావచ్చు. అందుకే గట్ శుభ్రంగా ఉండటం ముఖ్యం.
నటి మలైకా అరోరా ఇప్పుడు గట్ హెల్త్ గురించి కొన్ని టిప్స్ ఇచ్చారు. 'cookingwithguddan' అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఆమె దీని గురించి మాట్లాడారు. తన రోజు ఈ సింపుల్ డ్రింక్‌తోనే మొదలవుతుందని మలైకా చెప్పారు.
56
ఇది గట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది
"రాత్రిపూట జీలకర్ర, వాము, సోంపు.. ఒక్కో స్పూన్ చొప్పున తీసుకుని కొద్దిగా వేయిస్తాను. వాటిని ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెడతాను. ఉదయాన్నే ఆ నీటిని కొద్దిగా వేడి చేసి, గోరువెచ్చగా ఉన్నప్పుడు నిమ్మరసం కలిపి తాగుతాను. ఇది గట్ హెల్త్‌ను మెరుగుపరుస్తుంది" అని ఆమె తెలిపారు.
66
నా డేను ఇలా ప్రారంభిస్తా
ప్రతిరోజూ ఉదయం ఇదే డ్రింక్‌తో తన రోజును ప్రారంభిస్తానని మలైకా చెప్పారు. ఈ డ్రింక్ వల్ల కలిగే ప్రయోజనాలను కూడా ఆమె వివరించారు.