ఈ రోజుల్లో డయాబెటిస్ రోగుల సంఖ్య పెరుగుతోంది. జీవనశైలి, తినే అలవాట్లు, నిద్రలేమి, మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం ఇందుకు కారణం. క్లోమగ్రంధి తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోతే లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతే, రక్తంలో చక్కెర పెరిగి డయాబెటిస్ వస్తుంది.