Diabetes: షుగర్ పేషంట్స్ కు ఈ ఆకులు దివ్యౌషధం! రోజుకు రెండు నమిలితే చాలు..

Published : Jun 30, 2025, 11:50 AM IST

Diabetes: మీ ఇంట్లో ఎవరికైనా మధుమేహం ఉంటే మీరు ఈ ఔషధ మొక్కలను పెంచుకోవచ్చు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా నియంత్రించడంలో సహాయపడటమే కాకుండా ఇన్సులిన్ స్థాయిలను కూడా నిర్వహించడంలో సహాయపడతాయి. ఇంతకీ ఆ మొక్కలు ఏంటీ? 

PREV
15
షుగర్ కంట్రోల్

ఈ రోజుల్లో చాలామంది మధుమేహం సమస్యతో బాధపడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకోకపోతే ఈ వ్యాధిని నియంత్రించడం కష్టం. అయితే ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు, సహజ మార్గాల ద్వారా కూడా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. ఎలాగో తెలుసా? 

25
వ్యాధి నివారణ

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని ఆయుర్వేద మూలికలను క్రమం తప్పకుండా తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించడం సులభం. ఈ మొక్కలను ఇంట్లో కుండీలలో సులభంగా పెంచుకోవచ్చు.  ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో, తీపి తినాలనే కోరికను తగ్గించడంలో సహాయపడుతాయి.  

35
స్టీవియా

స్టీవియా మొక్క షుగర్ వ్యాధిగ్రస్తులకు ఓ వరం. స్టీవియా అనేది సహజమైన స్వీటెనర్, ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించబడుతుంది. ఇందులో కేలరీలు ఉండవు, కాబట్టి  రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కంట్రోల్ చేస్తుంది. 

45
కాస్టస్ ఇజియస్

కాస్టస్ ఇజియస్ మొక్కనే  'ఇన్సులిన్ ప్లాంట్' అని పిలుస్తారు. ఈ మొక్క రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఇందులో ఉండే క్రియాశీల సమ్మేళనాలు శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచడంలో సహాయపడతాయి.

55
జిమ్నెమా సిల్వెస్ట్రే (Gymnema Sylvestre)

జిమ్నెమా సిల్వెస్ట్రే (Gymnema Sylvestre) మొక్కనే "షుగర్ డిస్ట్రాయర్" అని కూడా పిలుస్తారు. దీనిని ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. దీనిని తీపికి ప్రత్యామ్నాయంగా వాడుతారు. ఈ తీగ మొక్క ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరం. దీని ఆకులను నమిలి తింటే.. దాదాపు ఒక గంట పాటు తీపి పదార్థం తిన్న ఫీలింగ్ ఉంటుంది. తద్వారా తీపి తినాలనే కోరిక తగ్గుతుంది.అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.  రక్తంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది క్లోమం  పనితీరును మెరుగుపరుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories