డైప‌ర్ వాడితే పిల్ల‌ల కిడ్నీలు దెబ్బ‌తింటాయా.? ఇందులో నిజ‌మెంత‌..

Published : Dec 03, 2025, 10:53 AM IST

Kids Health: సోష‌ల్ మీడియాలో ఎన్నో ర‌కాల వార్త‌లు వైర‌ల్ అవుతుంటాయి. వీటిలో ఎంత వ‌ర‌కు నిజం ఉంటుంద‌ని క‌చ్చితంగా చెప్ప‌లేం. చిన్నారులకు డైపర్ వేయడం వల్ల కిడ్నీ దెబ్బతింటుందనే ఓ వార్త తెగ వైర‌ల్ అవుతోంది. అయితే ఇందులో నిజ‌మెంతో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
డైపర్ వల్ల కిడ్నీస‌మ‌స్య‌లుంటాయా.?

సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న ఈ వార్త‌లో ఎలాంటి నిజం లేదు. కిడ్నీలు శరీరంలో లోతుగా ఉంటాయి. వాటికి ముందు కండరాలు, కొవ్వు పొరలు రక్షణగా ఉంటాయి. డైపర్ శరీరం బయట మాత్రమే త‌గులుతుంది. అవి ఎలాంటి పరిస్థితిలోనూ కిడ్నీ వరకు చేరవు. అందుకే డైపర్ వాడితే కిడ్నీకి హాని జరుగుతుందనే మాట పూర్తిగా తప్పుడు సమాచారం.

25
ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

డైపర్ వల్ల కిడ్నీ సమస్య ఏదీ రాదు. కానీ ఇతర చిన్న సమస్యలు రావచ్చు.

డైపర్ రాష్

ఒకే డైపర్ ఎక్కువసేపు తడిగా ఉంటే చర్మం ఎర్రబడుతుంది. ఇది కేవలం చర్మ సమస్య మాత్రమే.

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ (UTI)

చిన్నారుల్లో UTI రావడం బ్యాక్టీరియా కారణంగా జరుగుతుంది. ఇది డైపర్ వల్ల నేరుగా కలగదు. తడి ఉండటం, శుభ్రత సరిగాలేకపోవడం వల్ల అవకాశాలు పెరుగుతాయి. కానీ కిడ్నీపై ఎటువంటి దుష్ప్ర‌భావం ఉండ‌దు.

35
డైపర్‌ను ఎలా వాడితే సురక్షితం?

చాలా మంది డైప‌ర్ వాడ‌డం వ‌ల్ల స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌నే భావ‌న‌లో ఉంటారు. అయితే డైపర్ వాడటం తప్పు కాదు. కానీ స‌రైన విధానంలో వాడ‌క‌పోతే మాత్రం చిన్న చిన్న‌ సమస్యలు వస్తాయి. సరైన పద్ధతులు పాటిస్తే పిల్లలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

45
డైపర్ మార్చే సరైన సమయం

సాధారణంగా 3–4 గంటలకు ఒకసారి మార్చాలి. న‌వ‌జాత శిశువులు (న్యూ బార్న్ బేబీస్‌) అయితే ప్రతి 2 గంటలకోసారి మార్చటం మంచిది. రాత్రివేళలో ఎక్కువ అబ్జర్వ్ చేసే డైప‌ర్‌, ప‌గ‌లు కాటన్ న్యాపీ ఉపయోగిస్తే చర్మానికి గాలి త‌గులుతుంది. ప్రతి సారి డైపర్ మార్చేప్పుడు చర్మం పూర్తిగా ఎండిపోయేలా చూసుకోవాలి.

55
చర్మాన్ని రక్షించే చిన్న చిట్కాలు

డైపర్ వేసే ముందు చర్మంపై రాష్ క్రీమ్ లేదా కొబ్బరి నూనె రాసితే రక్షణ పొర ఏర్పడుతుంది. అలాగే చ‌ర్మాన్ని త‌డిగా ఉండేలా చూసుకోవాలి. మొత్తం మీద పిల్లలకు సరైన శుభ్రత, సరైన సమయానికి డైపర్ మార్చితే ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు.

Read more Photos on
click me!

Recommended Stories