Birth Control: ఇప్పటివరకు గర్భనిరోధ బాధ్యత ఎక్కువగా మహిళలపైనే ఉండేది. మహిళలే గర్భ నిరోధక మాతత్రలు వేసుకుంటారని తెలిసిందే. అయితే తాజాగా శాస్త్రవేత్తలు పురుషుల కోసం కొత్త రకమైన గర్భనిరోధక మాత్ర అభివృద్ధి దిశగా కీలక పురోగతి సాధించారు.
అమెరికాలోని కార్నెల్ల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. శరీరంలో స్పెర్మ్ తయారయ్యే ప్రక్రియను తాత్కాలికంగా ఆపే విధానాన్ని పరిశోధకులు గుర్తించారు. ఈ పద్ధతి వల్ల శాశ్వత నష్టం ఉండదని చెబుతున్నారు. మందు ఆపిన తర్వాత మళ్లీ సహజ స్థితికి వస్తుంది. ఇది పురుషుల గర్భనిరోధంలో పెద్ద మార్పునకు దారితీయవచ్చు.
25
ఇది ఎలా పనిచేస్తుంది?
ఈ కొత్త టెక్నాలజీ ఒక ముఖ్యమైన జీవశాస్త్ర ప్రక్రియపై పని చేస్తుంది. Meiosis అనే ప్రక్రియ స్పెర్మ్ తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ప్రక్రియను ప్రత్యేక రసాయనంతో తాత్కాలికంగా అడ్డుకున్నారు. దీంతో స్పెర్మ్ ఉత్పత్తి తాత్కాలికంగా ఆగిపోతుంది. ప్రయోగాల్లో ఎలుకలపై పరీక్షించగా మంచి ఫలితాలు కనిపించాయి.
35
ప్రయోగాల్లో ఏమి తేలింది?
శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో కొన్ని ముఖ్యమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మందు వాడినప్పుడు స్పెర్మ్ ఉత్పత్తి పూర్తిగా ఆగింది. మందు ఆపిన తర్వాత మళ్లీ స్పెర్మ్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఆ ఎలుకలు మళ్లీ ఆరోగ్యకరమైన పిల్లలను కన్నాయి. ఇది ఈ పద్ధతి తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తుందని సూచిస్తోంది.
ఇప్పటి వరకు పురుషుల గర్భనిరోధ పద్ధతులు పరిమితంగానే ఉన్నాయి. వీటిలో ప్రధానంగా కండోమ్, శాశ్వతంగా ఉండే వాసెక్టమీ (శస్త్రచికిత్స) ఉన్నాయి. అయితే హార్మోన్ ఆధారిత పద్ధతులు వాడితే భావోద్వేగాల్లో మార్పులు, లైంగిక ఆసక్తి తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. కానీ ఈ కొత్ విధానంలో మాత్రం హార్మోన్‌ల ప్రభావం ఉండదు. దీని ప్రభావం కేవలం తాత్కాలికంగానే ఉంటుంది.
55
ప్రారంభదశలోనే
అయితతే ఈ పరిశోధన ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉంది. ప్రస్తుతం ఉపయోగించిన రసాయనం మనుషులకు పూర్తిగా సురక్షితం కాదు. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది. మరింత సురక్షితమైన మందులు తయారు చేయడానికి పరిశోధనలు కొనసాగుతున్నాయి.