Yellow Teeth: పచ్చ పళ్లు తెల్లగా కావాలంటే ఏం చేయాలి?

Published : Aug 16, 2025, 11:34 AM IST

చాలా మంది పళ్లను ఎంత తెల్లగా తోమినా.. పచ్చగానే కనిపిస్తుంటాయి. కానీ కొన్ని సింపుల్ చిట్కాలతో పసుపు పచ్చని దంతాలను తిరిగి తెల్లగా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

PREV
16
పచ్చ పళ్లను తెల్లగా చేయడం ఎలా?

పసుపు పచ్చని దంతాలతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. దీనివల్ల నలుగురిలో నవ్వలేరు. మాట్లాడలేరు. నిజంగా ఇది ఇబ్బంది పెట్టే సమస్యే. మార్కెట్ లో ఖరీదైన టూత్ పేస్ట్ లు కూడా ఉన్నాయి.వీటితో దంతాలు తెల్లబడతాయని చెప్తుంటారు. అలాగే పళ్లను పాలిష్ కూడా చేయొచ్చు. కానీ ప్రతి ఒక్కరి దగ్గర అంత డబ్బు లేకపోవచ్చు. కానీ కొన్ని ఇంటి చిట్కాలతో కూడా పళ్లను తిరిగి తెల్లగా చేయొచ్చు. ఇవి పసుపు పచ్చ పళ్లను తిరిగి తెల్లగా చేస్తాయి. అలాగే పళ్లను బలంగా కూడా చేస్తాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

26
బేకింగ్ సోడా

బేకింగ్ సోడాను ఒక్క వంటల్లోకి మాత్రమే కాదు.. ఎన్నో పనులకు ఉపయోగించొచ్చు. దీనితో దంతాలను కూడా శుభ్రపరుచుకోవచ్చు. ఇందుకోసం బేకింగ్ సోడా పేస్ట్ లో నిమ్మరసానని మిక్స్ చేసి పళ్లపై రుద్దండి. దీనివల్ల పళ్లు పచ్చబడటం తగ్గుతాయి. ఈ చిట్కాను వారానికి రెండు మూడు సార్లు ప్రయత్నించండి. దీంతో పళ్లు పసుపు రంగులోకి మారడం ఆగిపోతుంది.

36
ఉప్పుతో శుభ్రం

అవును ఉప్పుతో కూడా పచ్చ పళ్లను తెల్లగా చేయొచ్చు. ఇందుకోసం రాతి ఉప్పును ఉపయోగించాలి. ఈ ఉప్పులో ఆవనూనెను కలిపి పళ్లపై రుద్ది క్లీన్ చేయొడి. దీనివల్ల పళ్లపై పేరుకుపోయిన మురికి తొలగిపోతుంది. పచ్చ పళ్లు తెల్లగా కూడా అవుతాయి.

46
ఆయిల్ పుల్లింగ్

రెగ్యులర్ మీరు ఆయిల్ పుల్లింగ్ చేసినా కూడా పచ్చ పళ్లు తిరిగి తెల్లగా అవుతాయి. ఇందుకోసం ప్రతిరోజూ ఉదయాన్నే ఒక 15 నిమిషాల పాటు కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేయండి. దీనివల్ల పళ్లకు పట్టిన ఫలకం, నోట్లోని బ్యాక్టీరియా తొలగిపోతుంది. ఈ ఆయిల్ పుల్లింగ్ పళ్లను శుభ్రపరుస్తుంది.

స్ట్రాబెర్రీలు, ఉప్పు

సిట్రస్ పండ్లతో కూడా పచ్చని పళ్లను తిరిగి తెల్లగా చేయొచ్చు. ముఖ్యంగా స్ట్రాబెర్రీలతో. ఇందుకోసం స్ట్రాబెర్రీల్లో కొంచెం ఉప్పును వేసి పళ్లపై రుద్దండి. దీనివల్ల దంతాలు తెల్లగా అవుతాయి. పళ్లు ఆరోగ్యంగానూ ఉంటాయి.

56
పండ్లను తినండి

దంతాలపై పేరుకుపోయిన ఫలకాన్ని, మురికిని తొలగించాలంటే జామ, ఆపిల్, క్యారెట్, ఆపిల్ వంటి పండ్లను నమిలి తినండి. ఈ పండ్లను కత్తితో కోసి తినే బదులుగా నేరుగా పండ్లతో కొరికి తినడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల దంతాల అంచులపై పేరుకుపోయి ఫలకం తొలగిపోతుంది. అలాగే పళ్లపై ఉన్న పసుపు దనం పోతుంది. నిజానికి ఈ పండ్లలో ఉండే సహజ ఆమ్ల మూలకాలు పచ్చని పళ్లను తిరిగి తెల్లగా చేయడానికి సహాయపడతాయి.

66
బొగ్గు పౌడర్

మార్కెట్ లో బొగ్గు పౌడర్ మనకు సులువుగా దొరుకుతుంది. ఈ బొగ్గు పౌడర్ పళ్లకు పట్టిన ధూళిని, కార్బన్ ను తొలగించడానికి సహాయపడుతుంది. మీరు కొన్ని రోజుల పాటు రెగ్యులర్ గా బొగ్గుతో పళ్లను తోమితే పసుపు రంగు పోయి దంతాలు తెల్లగా అవుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories