ధ్యానం.. మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటి చాలా సమస్యలను దూరం చేస్తుంది. రోజూ కాసేపు ధ్యానం, యోగా చేయడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజూ ఈజీగా చేయగలిగే కొన్ని యోగాసనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఉన్నారు. ఉద్యోగం, వ్యాపారం, చదువు, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తు గురించిన ఆలోచనలు ఇలా ఏదో ఒకటి మనల్ని ఒత్తిడికి గురిచేస్తోంది. మరి వాటినుంచి మనసుకు శాంతి, శరీరానికి విశ్రాంతి కలిగించేందుకు ధ్యానం (Meditation), యోగా అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి.
24
ధ్యానం వల్ల కలిగే లాభాలు
ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఒత్తిడి తగ్గుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచనా శక్తి పెరుగుతుంది. శరీరం ఉత్సాహంగా ఉంటుంది. నిద్ర లేమి సమస్య నుంచి ఉపశమనం దక్కుతుంది. రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాదు కోపం, ఆందోళన వంటి భావోద్వేగాలపై నియంత్రణకు ధ్యానం చక్కగా సహాయపడుతుంది.
34
ఇంట్లో సులభంగా చేయగలిగే యోగాసనాలు
ప్రాణాయామం (శ్వాస నియంత్రణ)
ప్రాణాయామం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. రక్త ప్రసరణ మెరుగవుతుంది. మెల్లగా శ్వాస తీసుకుని, మెల్లగా వదలాలి. రోజూ 5 నుంచి 10 నిమిషాలు చేస్తే సరిపోతుంది.
అణులోమ విలోమ ప్రాణాయామం
అణులోమ విలోమ ప్రాణాయామం ద్వారా శరీరంలోని నాడులు శుద్ధి అవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ముక్కు కుడి వైపు రంధ్రాన్ని వేలితో మూసి.. ఎడమ వైపు రంధ్రంతో శ్వాస తీసుకోవాలి. మళ్లీ ఎడమ వైపు రంధ్రాని మూసి.. కుడి వైపు రంధ్రంతో శ్వాస తీసుకొని వదలుతూ కొనసాగించాలి.
శవాసనా
శవాసనా.. శరీరానికి పూర్తిగా విశ్రాంతినిచ్చే ఆసనం. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. నిద్ర పోజిషన్‌లో.. కళ్లు మూసుకొని 5–10 నిమిషాలు మౌనంగా ఉండాలి.