కొన్ని మంచి అలవాట్లు మన జీవితాన్ని చాలా అందంగా మార్చేస్తాయి. ముఖ్యంగా ఉదయం నిద్ర లేవగానే కొన్ని పనులు చేయడం ద్వారా రోజంతా ఉత్సాహంగా, చురుకుగా, నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారు. మరి మన రోజును సంతోషంగా మార్చడానికి ఉపయోగపడే ఆ అలవాట్లేంటో తెలుసుకుందామా..
ఉదయం లేవగానే కొన్ని మంచి అలవాట్లను పాటించడం ద్వారా రోజంతా హ్యాపీగా ఉండొచ్చు. మనం రోజును ఎలా ప్రారంభిస్తామో.. దాని ప్రభావం ఆ మొత్తం రోజుపై పడుతుంది. కాబట్టి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలనుకునేవారు ఉదయం పూట కొన్ని అలవాట్లను కచ్చితంగా పాటించాలి. అవేంటో ఇక్కడ చూద్దాం.
నీరు తాగడం
ఉదయం నిద్రలేవగానే ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు తాగాలి. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. జీవక్రియను పెంచుతుంది. శరీర అవయవాలను చురుగ్గా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజు ఖాళీ కడుపుతో నీరు తాగడం మంచిది. అలాగే రోజు మొత్తంలో కనీసం 2-3 లీటర్ల నీరు తాగాలని నిపుణులు చెబుతుంటారు.
25
వ్యాయామం
ఉదయం పూట కాసేపైనా వ్యాయామం చేయండి. యోగా లేదా స్ట్రెచింగ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అవయవాల పనితీరు బాగుంటుంది. అంతేకాదు మానసిక ఒత్తిడిని తగ్గించడానికి, ఏకాగ్రతను పెంచడానికి కూడా వ్యాయామం సహాయపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడానికి కూడా వ్యాయామం చక్కగా ఉపయోగపడుతుంది.
35
ధ్యానం
ప్రతిరోజు 5 నుంచి 10 నిమిషాల పాటు ధ్యానం చేయడం మర్చిపోవద్దు. ఉదయం లేచిన వెంటనే 5-10 నిమిషాలు ధ్యానం కోసం కేటాయించండి. దీనివల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. అంతేకాదు.. భావద్వేగాలను నియంత్రించుకోవడంలో ధ్యానం సహాయపడుతుంది.
ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. పగటిపూట అలసటను తగ్గిస్తుంది. చాలామంది డైట్ కారణంగా లేదా సమయం లేకపోవడం వల్ల సరిగ్గా టిఫిన్ చేయరు. ఇది అస్సలు మంచిది కాదు. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా చేయాలి.
55
పాజిటివ్ గా ఆలోచించండి..
రోజును చాలా పాజిటివ్ గా, సంతోషంగా ప్రారంభించండి. ఉదయాన్నే ప్రతికూల ఆలోచనలు చేయడం మంచిది కాదు. ముందు రోజు ఏవైనా చెడు సంఘటనలు జరిగినా.. వాటిని గుర్తు చేసుకోవద్దు. ఎప్పుడూ సానుకూల ఆలోచనలను మనస్సులో ఉంచుకోండి. దానివల్ల రోజంతా ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారు.