Salt Water : మన ఆహారంలో అతి ముఖ్యమైనది ఉప్పు. ఉప్పు లేని ఆహారం తినడం కష్టమే. అయితే..ఉప్పును కేవలం ఆహారంలో వేసుకుని తినటం మాత్రమే కాదు. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే ఉప్పు నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.
ఉదయాన్నే ఉప్పు నీరు తాగడం వల్ల హైడ్రేషన్ మెరుగుపడుతుంది. ఎక్కువ దాహంగా అనిపించదు. ఉప్పు నీరు శరీరంలోని ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది.
57
ఎనర్జీ లెవల్స్
ఉప్పు నీటిలో ఖనిజాలు, ఎంజైమ్‌లు ఉండటం వల్ల, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉప్పు నీరు తాగితే మీ శక్తి పెరుగుతుంది. నిర్జలీకరణాన్ని నివారిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపడుతుంది.
67
నిద్రలేమికి చెక్
నిద్ర లేమి సమస్య ఉన్నప్పుడు ఉప్పు నీరు తాగడం నిద్ర మెరుగుపడటానికి సహాయపడుతుంది. ఉప్పు నీరు కొంతమందికి హైడ్రేషన్, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాని నిద్రలేమికి ప్రత్యక్ష కారణం కాకపోవచ్చు.
77
వారు మాత్రం అస్సలు తాగొద్దు
అధిక రక్తపోటు (Hypertension), మూత్రపిండాల వ్యాధి (Kidney disease) ఉన్న రోగులు ఉప్పునీరు తాగకూడదు. వారి ఉప్పునీరు తీసుకోవడం వల్ల రక్తంలో సోడియం స్థాయిలు పెరిగి, రక్తపోటు మరింతగా పెరగవచ్చు. అలాగే.. మూత్రపిండాల పనితీరును మరింతగా దెబ్బతీయవచ్చు.