షుగర్ వ్యాధి.. చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే ఈ వ్యాధి ప్రారంభంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయద్దని నిపుణులు చెబుతున్నారు. అవెంటో చూద్దాం.
రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు కిడ్నీలు రక్తంలోని అదనపు చక్కెరను వడపోయడానికి ప్రయత్నిస్తాయి. దీనివల్ల తరచుగా మూత్రవిసర్జన అవుతుంది. ముఖ్యంగా రాత్రిపూట. రాత్రి సమయంలో ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయడం షుగర్ వ్యాధి ముఖ్య లక్షణాల్లో ఒకటి.
24
శరీరంలో నీటి కొరత
తరచుగా మూత్రవిసర్జన చేయడం వల్ల శరీరం ఎక్కువ నీటిని కోల్పోతుంది. దీనివల్ల నీటి కొరత ఏర్పడుతుంది. ఫలితంగా సాధారణం కంటే ఎక్కువ దాహం వేస్తుంది. ఎంత నీరు తాగినా దాహం తీరదు. ఇది రక్తంలో అధిక చక్కెర స్థాయికి ఒక సాధారణ లక్షణంగా చెప్పవచ్చు.
34
చర్మం పొడిబారడం
రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల చర్మం పొడిబారడం, దురద, నల్లటి మచ్చలు, ఈస్ట్ లేదా ఫంగస్ ఇన్ఫెక్షన్లు (ముఖ్యంగా జననేంద్రియ ప్రాంతంలో) వచ్చే అవకాశం ఉంది. రక్తంలో అధిక చక్కెర బాక్టీరియా, ఫంగస్ లకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది.
సాధారణం కంటే ఎక్కువగా ఆకలి వేయడం.. తరచూ ఏదో ఒకటి తినాలని అనిపించడం కూడా షుగర్ వ్యాధి లక్షణాల్లో ముఖ్యమైంది. అంతేకాదు కళ్లు మసకగా కనబడటం, అలసట, నీరసం, బరువు తగ్గడం కూడా షుగర్ వ్యాధి లక్షణాల్లో ముఖ్యమైనవి. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.