Beer: మద్యం ప్రియులు ఎక్కువగా ఇష్టపడేది బీర్. సమ్మర్ వచ్చిందంటే చాలు కాటన్‌లు లేపేస్తుంటారు. అయితే బీర్ తాగే విషయంలో తెలిసో తెలియకో చాలా మంది కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇంతకీ ఆ తప్పులు ఏంటంటే.?
బీరు తాగేటప్పుడు ఎక్కువ మంది తప్పు చేసే విషయం ఏమిటంటే, సరైన గ్లాసు ఉపయోగించకపోవడం. బీరు నిజమైన రుచి, వాసన సరైన గ్లాసులో మాత్రమే బయటకు వస్తాయి. స్టీలు గ్లాసులో పోసుకుని తాగితే దాని రుచి మారుతుంది. అందుకే పింట్ గ్లాసు, మగ్ లేదా ప్రత్యేక బీరు గ్లాసులను ఉపయోగించడం మంచిది. చాలా మంది ఉపయోగించే ప్లాస్టిక్ గ్లాసులు కూడా మంచివి కావంటా.
25
ఫ్రిజ్ నుంచి తీయగానే తాగడం
చాలా మంది బీరును ఫ్రిజ్‌ను తీసిన వెంటనే తాగుతుంటారు. అయితే ఇది కూడా మంచి అలవాటు కాదని చెబుతున్నారు. విపరీతమైన కూల్‌లో కూడా బీర్ రుచి మారుతుందంటా. అందుకే బీర్‌ను 3°C – 7°C లో తీసుకోవడం ఉత్తమం. అప్పుడు బీరు రుచి, వాసనను పూర్తిగా ఆస్వాదించవచ్చు.
35
బీరును గ్లాసులోకి పోయడం
బీరును గ్లాసులోకి పోసే విషయంలో కూడా చిట్కాలను పాటించాలి. ముఖ్యంగా బీరు బాటిల్‌ను గ్లాసులోకి 45° కోణంలో పోయాలి. ఇలా చేస్తే నురుగు సమతుల్యంగా ఉంటుంది. ఇది బీరు పై తాకే ఫోమ్ ను నియంత్రిస్తుంది. అలాగే ప్రతి సిప్‌లో రుచి సంతృప్తికరంగా ఉంటుంది.
బీరు రుచిని అస్వాదించాలంటే తాగే సమయంలో తీసుకునే ఫుడ్ విషయంలో కూడా కొన్ని టిప్స్ పాటించాలి. పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్, బార్బెక్యూ వంటి ఆహారాలు బీరు రుచిని పెంచుతాయి. అయితే కొందరు బిరియాని వంటి వాటితో బీర్ తీసుకుంటారు. దీనివల్ల కడుపు ఉబ్బరంగా మారి ఇబ్బంది అవుతుంది.
55
నెమ్మదిగా సిప్స్ తీసుకోండి
అత్యంత ముఖ్యమైన విషయం.. బీరు తాగేప్పుడు ఎట్టి పరిస్థితుల్లో త్వరగా మింగకూడదు. నెమ్మదిగా, ఆస్వాదిస్తూ సిప్స్ తీసుకోవడం ద్వారా బీరు రుచిని, వాసనను ఆస్వాదించవచ్చు. త్వరగా మింగేస్తే రుచి తెలియదు, అదే విధంగా కడుపులో ఉబ్బరం కూడా పెరుగుతుంది.
గమనిక: బీరు తాగడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా యువత ఎక్కువగా ఆకర్షితులవుతుంటారు. అయితే ఆల్కహాల్ అనేది ఆరోగ్యానికి మంచిది కాదనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి.