ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఫుడ్ తీసుకోవడం ఎంత ముఖ్యమో.. మంచి నీళ్లు తాగడం కూడా అంతే ముఖ్యం. అందుకే చాలామంది ఆర్వో వాటర్ ప్యూరీఫయర్ లను వాడుతుంటారు. కానీ ఆర్వో వాటర్ తాగడం ఆరోగ్యానికి మంచిదా? కాదా? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
ఆర్వో అంటే రివర్స్ ఆస్మోసిస్. ఇది నీటిని శుద్ధి చేసే ఒక ప్రక్రియ. ఈ పద్ధతిలో మెమ్ బ్రేన్ ద్వారా నీటిని శుద్ధి చేస్తారు. ఈ మెమ్ బ్రేన్ నీటిలోని కెమికల్స్, లవణాలు, బాక్టీరియా, కలుషిత పదార్థాలను తొలగించి స్వచ్ఛమైన, శుభ్రమైన నీటిని మాత్రమే బయటకు పంపిస్తుంది. కాబట్టి చాలామంది ఈ ఆర్వో వాటర్ ప్యూరిఫైయర్లను వాడుతుంటారు. కానీ ఆర్వో వాటర్ తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందా? హాని జరుగుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.
25
నిపుణుల మాట..
ప్రస్తుతం చాలా ఇళ్లు, ఆఫీసులు, హాస్పిటల్స్ వంటి వాటిలో రివర్స్ ఆస్మోసిస్ వాటర్ ప్యూరిఫైయర్లను ఎక్కువగా వాడుతున్నారు. అయితే వీటి ద్వారా స్వచ్ఛమైన నీటిని తాగుతున్నామని చాలామంది అనుకుంటారు. కానీ అతిగా శుద్ధి చేసిన ఆర్వో వాటర్ ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ఆర్వో ప్రక్రియలో కేవలం కాలుష్య కారకాలే కాదు.. శరీరానికి అవసరమైన ఖనిజాలు కూడా తొలగిపోతాయని చెబుతున్నారు.
35
RO వాటర్ వల్ల కలిగే లాభాలు:
RO టెక్నాలజీ ద్వారా నీటిలో ఉండే హానికరమైన కెమికల్స్ (ఆర్సెనిక్, ఫ్లోరైడ్, నైట్రేట్) బాక్టీరియా, మెటల్స్ వంటివి తొలగిపోతాయి. దానివల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అంతేకాదు బోర్లు లేదా కలుషిత వనరుల నుంచి వచ్చే నీటిని కూడా RO ఫిల్టర్ శుద్ధి చేసి తాగునీటిగా మార్చుతుంది. ఇది నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రత్యేకించి చిన్న పిల్లలు, వృద్ధులు, రోగులు వంటి వారికి శుద్ధి చేసిన RO నీరు తాగడం వల్ల మేలు జరుగుతుంది. ఇతర ఫిల్టర్లతో పోలిస్తే RO సిస్టమ్స్ నీటిని చాలా ఖచ్చితంగా శుద్ధి చేస్తాయి. దానివల్ల నీటిలో దాదాపు 95-99% వరకు హానికర పదార్థాలు తొలగిపోతాయి.
నిపుణుల ప్రకారం.. RO ఫిల్టర్లు నీటిలో ఉండే హానికరమైన పదార్థాలతో పాటు శరీరానికి మేలు చేసే ఖనిజాలను (లైమ్, కాల్షియం, మెగ్నిషియం వంటివి) కూడా తొలగిస్తాయి. దానివల్ల నీటిలో న్యూట్రిషనల్ విలువ తగ్గిపోతుంది. ఇలాంటి ఖనిజాలు లేని నీరు తాగడం వల్ల ఎముకల బలహీనత, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం ఉంది. పైగా RO టెక్నాలజీలో ఒక్క లీటర్ శుద్ధమైన నీటిని తయారు చేయడానికి సుమారు 3-4 లీటర్ల వరకు నీరు వృథా అవుతుంది. RO యంత్రాలు కొనుగోలు చేయడం, నిర్వహించడం కూడా ఖర్చుతో కూడుకున్న పని.
55
గుర్తుంచుకోవాల్సిన విషయాలు
రెగ్యులర్ గా RO వాటర్ తాగుతున్నవారు ఖచ్చితంగా మినరల్ కార్ట్రిడ్జ్ లేదా టీడీఎస్ కంట్రోలర్ ఉండే RO సిస్టమ్స్ ను ఉపయోగించాలి. తద్వారా శరీరానికి ఉపయోగకరమైన ఖనిజాలు కొంతవరకు నీటిలో నిల్వ ఉంటాయి. వృథా నీటిని కూలింగ్, గార్డెనింగ్, టాయిలెట్ ఫ్లషింగ్ వంటి పనులకు వినియోగించడం ద్వారా నీటి వృథాను నివారించవచ్చు. సాధ్యమైనంత వరకు నీటి నాణ్యతను పరీక్షించి అవసరమైతేనే RO వాడాలి. తక్కువ TDS ఉన్న మంచినీటికి RO అవసరం లేదు.