స్నానం చేయడం ఎంత ముఖ్యమో.. చేసిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అంతే ముఖ్యం అంటున్నారు నిపుణులు. స్నానం చేసిన వెంటనే కొన్ని పనులు చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నారు. మరి ఏ పనులు చేయకూడదో తెలుసుకుందామా..
మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంపై మాత్రమే కాదు.. చాలా విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్నానం చేసిన తర్వాత కొన్ని పనులు చేయడం అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. దానివల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని చెబుతున్నారు. మరి స్నానం చేసిన తర్వాత ఏ పనులు చేయకూడదో ఇక్కడ చూద్దాం.
25
నీళ్లు తాగకూడదు:
సాధారణంగా తిన్న వెంటనే స్నానం చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. అలాగే, స్నానం చేసిన తర్వాత కూడా కొన్ని పనులు చేయకూడదట. వాటిలో ముఖ్యమైంది వాటర్ తాగడం. చాలామందికి స్నానం చేసిన వెంటనే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. కానీ.. అది తప్పు. స్నానం చేసేటప్పుడు శరీర ఉష్ణోగ్రత, రక్త ప్రసరణ భిన్నంగా ఉంటాయి కాబట్టి.. స్నానం చేసిన వెంటనే నీరు తాగితే శరీరంపై చెడు ప్రభావం పడుతుంది. ముఖ్యంగా రక్త ప్రసరణ దెబ్బతింటుంది.
35
హెయిర్ డ్రైయర్:
కొంతమంది స్నానం చేసి వచ్చిన వెంటనే హెయిర్ డ్రైయర్‌ని ఉపయోగిస్తుంటారు. కానీ ఇలా చేస్తే.. జుట్టు మృదుత్వం కోల్పోతుంది. రాలిపోయే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి స్నానం చేసిన వెంటనే హెయిర్ డ్రైయర్ వాడకపోవడం మంచిది.
స్నానం చేసి వచ్చిన తర్వాత చర్మాన్ని గట్టిగా రుద్దే అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలి. దానివల్ల చర్మంలో నీటి శాతం తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా చర్మం పొడిబారుతుంది. దురద కూడా రావచ్చు.
55
ఎండలోకి వెళ్లకండి:
స్నానం చేసి వచ్చిన వెంటనే ఎండలోకి వెళ్లకూడదు. ఎందుకంటే సూర్యకాంతి వల్ల శరీరం వేడెక్కుతుంది. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్నానం చేసిన వెంటనే ఈ తప్పు చేయకండి.