Telugu

ముఖం బంగారంలా మెరిసిపోవాలంటే ఈ ఒక్క ఫేస్ ప్యాక్ చాలు!

Telugu

బొప్పాయిలోని పోషకాలు

బొప్పాయిలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైబర్, పపైన్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి సహజ సౌందర్యానికి మంచి టానిక్ లాగా పనిచేస్తాయి.

Image credits: Pinterest
Telugu

బొప్పాయి ప్రయోజనాలు

బొప్పాయి కణాల పునరుత్పత్తికి సహాయపడుతుంది. ముడతలను తగ్గిస్తుంది. బొప్పాయిలోని పపైన్ ఎంజైమ్ మృతకణాలను తొలగిస్తుంది. చర్మ కాంతికి సహాయపడుతుంది.  

Image credits: Getty
Telugu

బొప్పాయి, పెరుగు

బొప్పాయి గుజ్జులో పెరుగు కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత కడిగేయండి. మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.

Image credits: Pinterest
Telugu

బొప్పాయి, తేనె

బొప్పాయి గుజ్జులో ఒక చిన్న చెంచా తేనె కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత కడిగేయండి. తేనె మీ చర్మానికి అదనపు తేమను ఇస్తుంది

Image credits: FREEPIK
Telugu

బొప్పాయి, పసుపు

బొప్పాయి గుజ్జులో పెరుగు, పసుపు కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 10-15 నిమిషాల తర్వాత కడగండి. ఇలా చేస్తే చర్మంపై మచ్చలు తగ్గుతాయి.  

Image credits: PINTEREST
Telugu

బొప్పాయి, ఓట్స్

బొప్పాయి గుజ్జులో పెరుగు, ఓట్స్ కలిపి.. ముఖానికి రాసి, సున్నితంగా మసాజ్ చేయండి. 15 నిమిషాల తర్వాత కడగండి. ఇది మృత కణాలను తొలగిస్తుంది. ముఖాన్ని లోపలి నుంచి శుభ్రం చేస్తుంది.  

Image credits: PINTEREST
Telugu

బొప్పాయి, నిమ్మరసం

పండిన బొప్పాయిలో పెరుగు, నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, ముఖ్యంగా మచ్చలున్న చోట అప్లై చేయండి. 10 నిమిషాల తర్వాత కడగండి. ఈ ఫేస్ ప్యాక్ మచ్చలను తొలగిస్తుంది.

Image credits: PINTEREST
Telugu

వారానికి ఎన్నిసార్లు వాడచ్చు?

ఈ ఫేస్ మాస్క్‌లను వారానికి 1-2 సార్లు వాడచ్చు. అయితే వాడే ముందు.. ప్యాచ్ టెస్ట్ తప్పనిసరి. 

Image credits: PINTEREST

Face Glow: టమాట ఐస్ క్యూబ్స్ తో మెరిసే ముఖం మీ సొంతం!

Kitchen Hacks: ఫ్రిజ్ లో నుంచి చెడు వాసన రావద్దంటే ఇలా చేయండి!

టవర్లు లేకుండానే ఇంటర్నెట్.. మస్క్ మామా సంచలనం.