Eye Care: మన శరీరంలోని అన్ని అవయవాలలో కళ్లు చాలా ముఖ్యం. కానీ, ఈ రోజుల్లో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. కంటి సమస్యలను తగ్గించుకోవడానికి సహాయపడే సూపర్ పుడ్ గురించి తెలుసుకుందాం.
మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కళ్లు ఒకటి. వీటి ఆరోగ్యం దెబ్బతింటే.. ఏమీ కనిపించదు. ప్రపంచం మొత్తం చీకటిగా మారుతుంది. అందుకే సర్వేంద్రియం నయనం ప్రధానం అంటారు పెద్దలు. అయితే.. నేటి తరుణంలో చిన్నారులకు సైతం కంటి చూపు మందగిస్తోంది. పోషకాలు ఉండే ఆహారాలను తింటే కంటి చూపును మెరుగు పరుచుకోవచ్చు. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే టాప్ 10 సూపర్‌ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.
211
క్యారెట్
క్యారెట్‌లో బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. విటమిన్ A స్పష్టమైన దృష్టికి అవసరం కాగా, ఇది రాత్రి అంధత్వం వంటి సమస్యల నుండి కళ్లను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
311
పాలకూర
పాలకూరలో ల్యూటీన్, జియాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి సూర్యుడు నుంచి వచ్చే హానికరమైన కిరణాల నుండి కళ్ళను రక్షిస్తాయి. కంటిశుక్లం రాకుండా సహాయపడతాయి.
ప్రతిరోజూ ఉసిరికాయ తినడం వల్ల కళ్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరిలో విటమిన్ C సమృద్ధిగా ఉండటం వల్ల కంటి కండరాలను బలపడి, కంటి అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది..
511
బాదం
బాదంలో విటమిన్ E అధికంగా ఉంటుంది. ఇది కంటి కణాలను హానికలిగించే మూలకాల నుండి రక్షిస్తుంది. ప్రతిరోజూ 5–6 నానబెట్టిన బాదంపప్పులు తినడం వల్ల కంటి అలసట తగ్గి, కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
611
గుడ్డు
గుడ్లు తినడం వల్ల కళ్ళలోని మాక్యులా అనే ప్రాంతం రక్షించబడుతుంది, ఇది స్పష్టమైన దృష్టికి చాలా ముఖ్యం. గుడ్లలో జింక్, ల్యూటీన్ ఉంటాయి, ఇవి కంటిశుక్లం (మాక్యులార్ డిజెనరేషన్) వంటి సమస్యల నుండి కళ్లను రక్షిస్తాయి.
711
దానిమ్మ
దానిమ్మ కళ్లలో రక్త ప్రసరణను మెరుగుపరచి తగినంత ఆక్సిజన్, పోషకాలను అందిస్తుంది. ఇది కంటి కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతూ దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
811
కొబ్బరి నీళ్లు
కొబ్బరి నీళ్ళు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా కళ్లకు తేమనిచ్చి పొడిబారకుండా చేస్తాయి. కంటి అలసటను తగ్గిస్తాయి.
911
అవిసె గింజలు
అవిసె గింజలలో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కళ్లు పొడిబారడం, మంటను తగ్గించడంలో సహాయపడుతాయి. ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కంటి అలసటను తగ్గిస్తాయి.
1011
ఆరెంజ్
ఆరెంజ్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల కంటి కణాలకు రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో దృష్టి నష్టాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
1111
బీట్ రూట్
బీట్ రూట్ లో నైట్రేట్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్లకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచి రెటీనాకు రక్షణగా నిలిస్తాయి. అలాగే.. బీట్ రూట్ రెగ్యులర్ గా తినడం వల్ల కంటి చూపు మందగింపు, వయస్సుతో వచ్చే కంటి సమస్యలను తగ్గించుకోవచ్చు.