అల్యూమినియం పాత్రల్లో వంట చేస్తున్నారా ? కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!

Published : Jun 28, 2025, 09:11 AM IST

Aluminum Utensils: ఈ రోజుల్లో చాలా మంది అల్యూమినియం పాత్రల్లోనే వంట చేస్తున్నారు. తక్కువ ధర, తేలికగా లభ్యత వంటి కారణాల వల్ల ఇవి చాలా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అయితే.. అల్యూమినియం పాత్రల వాడకం వల్ల ఆరోగ్యానికి దుష్ప్రభావాలు కలుగుతాయంట. ఇంతకీ ఆ నష్టాలు?

PREV
16
అల్యూమినియం పాత్రల్లో వంట చేస్తున్నారా ?

ఈ రోజుల్లో చాలా మంది వంటకు అల్యూమినియం పాత్రలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. తక్కువ ధరకే లభించడం, తేలికగా ఉండటంతో ఇవి త్వరగా  ప్రాచుర్యం పొందాయి. అయితే సంవత్సరాలుగా అల్యూమినియం పాత్రలను వాడితే.. వెంటనే మార్చేయండి. ఈ పాత్రలకు ఎక్స్పైరీ ఉంటుందట. అలాంటి వాటిని వాడకం వల్ల ఆరోగ్యానికి దుష్ప్రభావాలు ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.  శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

26
అల్యూమినియం పాత్రలను ఎప్పుడు మార్చాలి?

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో అల్యూమినియం పాత్రల గడువు త్వరగా ముగుస్తుందని తయారీ సంస్థ తెలియజేశాయి.  ఆ పాత్రల వాడకం, నాణ్యతను బట్టి ప్రతి 12 నుంచి 24 నెలలకు ఒకసారి మార్చాలని వారు సూచించారు.

36
BIS ప్రమాణాల ప్రకారం

BIS ప్రమాణాల ప్రకారం.. వంట పాత్రలలో సీసం, కాడ్మియం, పాదరసం, హెక్సావాలెంట్ క్రోమియం వంటి విషపూరిత లోహాల మూలకాలు 0.05% కంటే తక్కువగా ఉండాలి.

46
ఎన్ని రోజులు వాడాలి?

నిపుణుల ప్రకారం.. రెండేళ్లు దాటిన అల్యూమినియం పాత్రల్లో వంట చేయడం హానికరం. ఎందుకంటే.. అల్యూమినియం మెత్తటి లోహం. ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఎక్కువ కాలం వాడితే.. ఆ పాత్ర నాణ్యత తగ్గుతుంది. సాధారణంగా తేలికైన అల్యూమినియం పాత్రలు ఒక సంవత్సరం వరకు మాత్రమే వాడాలి,  మధ్యస్థ, బరువైన పాత్రలను రెండు సంవత్సరాల వరకు వాడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలామంది వినియోగదారులు అల్యూమినియం పాత్రలను జీవితాంతం వాడాలనుకుంటున్నారు. కానీ వాటిని 12 నుంచి 20 నెలల వరకే వాడాలి. 

56
ఆరోగ్యానికి హానికరం

కొంతమంది పాత్రల తయారీదారులు మొదటి సంవత్సరం తర్వాత పూతలు ఊడిపోవడం ప్రారంభిస్తాయని అంగీకరించారు. ఇది ఆరోగ్యానికి హానికరం. అందువల్ల ఆరోగ్య సమస్యలను నివారించడానికి వినియోగదారులు అలాంటి పాత్రలను మార్చాలని తయారీదారులు అన్నారు.

66
అల్యూమినియం గ్రేడింగ్

స్వచ్ఛమైన అల్యూమినియం 'గ్రేడ్ 19000', ఇందులో 99% అల్యూమినియం ఉంటుంది. '63540' లేదా '60342' వంటి ఇతర గ్రేడ్‌లు మిశ్రమ లోహాలు, ఇవి గట్టిగా ఉంటాయి, కానీ ఇతర మూలకాలతో కలిసి ఉంటాయి.  ఏదిఏమైనా అల్యూమినియం గిన్నెల్లో వాడటం వల్ల కిడ్నీ, మెదడు, క్యాన్సర్​ వంటి వాధ్యులు వచ్చే అవకాశముంది. 

Read more Photos on
click me!

Recommended Stories