Almonds: బాదం పప్పును పొట్టుతో తింటే మంచిదా? పొట్టు తీసి తింటే మంచిదా?

బాదం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలుసు. రుచిగా ఉండటం వల్ల పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తింటారు. ప్రతిరోజు బాదం పప్పును తినడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రోజూ కొన్ని బాదం పప్పులు తప్పకుండా తినాలని నిపుణులు కూడా చెబుతుంటారు. అయితే బాదం పప్పును పొట్టుతో తినాలా? లేదా నానబెట్టి పొట్టు తీసి తినాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో ఇక్కడ తెలుసుకుందాం.

Almonds With or Without Skin Health Benefits Explained in telugu KVG

ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో బాదం తినాలని నిపుణులు చెబుతుంటారు. ఇది మెదడు ఆరోగ్యానికి, శరీర ఆరోగ్యానికి రెండింటికి ముఖ్యమైంది. బాదంలో చాలా పోషకాలు ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. అందుకే చాలామంది బాదం పప్పును ఇష్టంగా తింటారు.

Almonds With or Without Skin Health Benefits Explained in telugu KVG
బాదం ఎలా తింటే మంచిది?

బాదం ఎలా తినాలనే దానిపై చాలా మందికి సందేహాలు ఉంటాయి. బాదంను పొట్టుతో తినాలా? లేదా నానబెట్టి పొట్టు తీసి తినాలా? ఈ రెండింటి మధ్య తేడాలు ఏంటి? అని చాలామంది ఆలోచిస్తుంటారు. బాదం ఎలా తింటే ఆరోగ్యానికి మంచిదో ఇక్కడ తెలుసుకుందాం.


బాదం పొట్టుతో తినడం వల్ల లాభాలు

- పొట్టుతో ఉండే బాదంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పొట్టుతో బాదం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. 

- ఇంకా పొట్టుతో ఉండే బాదంలో యాంటీ ఆక్సిడెంట్లు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి, ఆక్సీకరణ నష్టాన్ని ఎదుర్కోవడానికి సహాయపడుతాయి. 

- బాదంలో ఉండే ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. నిరంతర శక్తి కోసం ఇది ఒక మంటి ఎంపిక.

- పొట్టుతో ఉండే బాదం తింటే కడుపు నిండుగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది.

పొట్టు లేకుండా బాదం తినడం వల్ల లాభాలు

- బాదంను నానబెట్టి దాని పొట్టు తీసి తింటే సున్నితంగా ఉంటుంది. జీర్ణం చేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది.

- నానబెట్టి పొట్టు తీసిన బాదం పోషకాలను గ్రహించడాన్ని పెంచుతుంది. జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది.

- నానబెట్టి పొట్టు తీసిన బాదం మధుమేహాన్ని నియంత్రిస్తుంది, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది, గుండె జబ్బులను నివారిస్తుంది. మొత్తం ఆరోగ్యానికి మంచిది.

పొట్టుతో లేదా పొట్టు తీసిన బాదం: ఏది మంచిది?

బాదంను ఎలాగైనా తినవచ్చు. అది వ్యక్తిగత ఎంపిక. మీరు పొట్టుతో ఉండే బాదం తిన్నా సరే లేదా నానబెట్టి పొట్టు తీసి బాదం తిన్నా సరే. ఇవి రెండూ మీ మొత్తం ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా మీ ఆకలిని తీరుస్తాయి.

Latest Videos

vuukle one pixel image
click me!