Eating Food
శారీరక ఆరోగ్యం బాగుండాలంటే.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే.. కేవలం హెల్దీ ఫుడ్ తీసుకుంటే సరిపోదు. మనం ఆ ఆహారాన్ని ఎప్పుడు తింటున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. మన శరీరానికి పనిచేసే బయోలాజికల్ క్లోక్ ఉంటుంది. ఇది ఆహారాన్ని ఎలా జీర్ణం చేయాలో, శక్తిని ఎలా వాడాలో నియంత్రిస్తూ ఉంటుంది. కాబట్టి, ఆహారాన్ని నిర్ణీత సమయాలకు తీసుకుంటే శరీర వ్యవస్థలు సమర్థవంతంగా పని చేస్తాయి.
healthy breakfast
జీర్ణక్రియ మెరుగవుతుంది
ఆహారాన్ని సకాలంలో తీసుకోవడం వల్ల జీర్ణక్రియ గాడిలో ఉంటుంది. ఉదయాన్నే పిండి పదార్థాలతో కూడిన అల్పాహారం తీసుకుంటే శరీరం రోజంతా శక్తివంతంగా ఉంటుంది. అదే సమయంలో రాత్రి భోజనాన్ని ఆలస్యంగా చేయడం వల్ల ఆహారం జీర్ణం కాక ముందే నిద్రపోవడం జరుగుతుంది. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలు, నిద్రలేమి లాంటి సమస్యలకు దారితీస్తుంది.
శక్తి స్థాయిని నిలుపుకోవచ్చు
ఆహారాన్ని సరైన సమయం లో తీసుకుంటే, శరీరానికి అవసరమైన శక్తి సమయానికి లభిస్తుంది. దీని వల్ల మానసిక ఉత్సాహం, దైనందిన పనులలో ఉత్సాహం తగ్గదు. ఉదయం అల్పాహారం మిస్ చేస్తే రోజంతా అలసటగా ఉంటుంది. అలాగే మధ్యాహ్న భోజనానికి విరామం లేకపోతే, కన్‌స్ట్రేషన్ తగ్గుతుంది.
బరువు నియంత్రణలో ఉంటుంది
ఆహారాన్ని సమయానికి తినడం వల్ల ఆకలి గమనంలో ఉంటుంది. ఎక్కువ గ్యాప్‌లు ఇస్తే ఓవర్‌ఈటింగ్ జరిగే అవకాశాలు పెరుగుతాయి. ఇది బరువు పెరుగుదలకు దారితీస్తుంది. కన్సిస్టెంట్ మీల్స్ ప్లానింగ్ వల్ల మీటబాలిజం మెరుగవుతుంది. ముఖ్యంగా రాత్రి తక్కువగా తినడం వల్ల బరువు తగ్గించుకోవడంలో సహాయపడుతుంది.
మెరుగైన నిద్ర
రాత్రి భోజనాన్ని త్వరగా పూర్తిచేయడం వల్ల శరీరానికి ఆహారాన్ని జీర్ణం చేసుకునే సమయం దొరుకుతుంది. ఇది నిద్ర నాణ్యతను పెంచుతుంది. భోజనం తర్వాత వెంటనే పడుకుంటే నిద్రలో అంతరాయం ఏర్పడుతుంది. కొంత సమయం గ్యాప్ ఇవ్వడం వల్ల శరీరం విశ్రాంతిగా ఉంటుంది.
Eating Food
క్రీడాకారులకు, శారీరక శ్రమ చేసే వారికి ప్రత్యేకమైన అవసరం
సాధారణంగా మధ్యాహ్నం, రాత్రి భోజనాల మధ్య 4–5 గంటల గ్యాప్ ఉంటే సరిపోతుంది. కానీ క్రీడాకారులు లేదా ఫిట్‌నెస్ పై దృష్టి పెట్టేవాళ్లు ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తారు. వీరికి చిన్న చిన్న మీల్స్, స్నాక్స్ అవసరం. ఇది వారి శక్తి స్థాయిని నిలబెట్టడంలో, శరీరంలో పోషకాలను సమర్థంగా వినియోగించడంలో సహాయపడుతుంది.
ఇవి అన్నీ కలిపి చూస్తే, ఆరోగ్యంగా ఉండాలంటే సరైన సమయానికి తినడం అనేది ఎంత ముఖ్యమో స్పష్టమవుతుంది. జీవనశైలిలో చిన్న మార్పులతో పెద్ద ప్రయోజనాలు పొందవచ్చు.