రోజు రోజుకు కొత్త రకాల వ్యాధులు వ్యాపిస్తుండటంతో చాలామంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఆరోగ్యానికి హాని చేేసే పదార్థాలను అవైడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం చాలామంది నూనె వాడకం తగ్గించడం లేదా మొత్తానికే నూనె లేకుండా కూడా ఫుడ్ తీసుకుంటున్నారు. కానీ అలా చేయడం మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ చూద్దాం.
2 వారాలు నూనె తినకపోతే ఏమవుతుంది?
నూనె శరీరానికి అవసరమైన మంచి కొలెస్ట్రాల్ ను కూడా అందిస్తుంది. రెండు వారాలపాటు నూనె లేని ఆహారం తినడం వల్ల జీర్ణక్రియ, జీవక్రియపై చాలా స్వల్పకాలిక ప్రభావాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆహారంలో నూనె తీసుకోకపోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, క్యాలరీలు అందకపోవచ్చని అంటున్నారు.
శక్తిపై ప్రభావం
నూనె తీసుకోకపోవడం వల్ల చిన్న ప్రేగులో ఉండే మైకెల్స్ నిర్మాణం బలహీనపడుతుంది. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను తగ్గిస్తుంది. అంతే కాదు రెండు వారాలపాటు ఆహారం నుంచి నూనెను తీసివేస్తే చర్మ ఆరోగ్యం, శరీర శక్తిపై ప్రభావం పడుతుంది. చర్మం పొడిబారడం లాంటి సమస్యలు వస్తాయి.
నూనెకు బదులుగా..
ఎక్కువ రోజులు నూనె లేని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అలసట, నీరసం ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి అవసరమైన మోతాదులో నూనె తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ నూనె తగ్గించాలి అనుకుంటే బదులుగా చేపలు, గింజలు, విత్తనాలు, గుడ్లు, పాలు తీసుకోవడం వల్ల కొవ్వు ఆమ్లాలను పొందవచ్చని సూచిస్తున్నారు.