మసాలా దినుసులు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయని చాలా మంది వాటిని ఫ్రిడ్జ్ లో పెడుతారు. కానీ వాటికి కూడా గడువు ఉంటుంది. ముఖ్యంగా కెచప్, మయోన్నైస్, ఆవాలు, సోయా సాస్ వంటివి కొంత కాలానికి మాత్రమే మంచిగా ఉంటాయి. పాడైన మసాలా దినుసులకు రుచి ఉండదు, కొన్నిసార్లు అవి బాక్టీరియా పెరుగుదలకు దారితీస్తాయి. వాటి వాసన చూసి, ఏదైనా మార్పు ఉంటే వెంటనే పారేయండి.