Health: డాక్ట‌ర్ ముందుగా నాలుక‌ను ఎందుకు చూస్తారో తెలుసా.?

Published : May 12, 2025, 06:07 PM IST

డాక్టర్‌ను కలిసినప్పుడు ముందుగా మన నాలుకను పరిశీలిస్తారనే విషయం చాలామందికి తెలిసిందే. నాలుకను గమనించడం ద్వారా శరీరంలో జరుగుతున్న ఆరోగ్య సమస్యలపై ఓ అవగాహన వస్తుంది. సాధారణంగా పింక్ కలర్‌లో సాఫ్ట్‌గా ఉండే నాలుక ఆరోగ్యానికి సంకేతంగా భావిస్తారు. అయితే నాలుక రంగులో మార్పులు కనిపిస్తే, అది ఒక హెచ్చరికగా పరిగణించాలి.  

PREV
16
Health: డాక్ట‌ర్ ముందుగా నాలుక‌ను ఎందుకు చూస్తారో తెలుసా.?

కొన్ని సందర్భాల్లో తిన్న ఆహారం లేదా తాగిన పానీయాల వల్ల రంగు తాత్కాలికంగా మారొచ్చు. కానీ తరచూ ఒకే రంగులో కనిపిస్తే, అది శరీరంలో జరిగే సమస్యల గుర్తు కావచ్చు. ఇప్పుడు నాలుక రంగు ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు అంచనా వేయవచ్చో తెలుసుకుందాం.
 

26

తెలుపు రంగులో ఉంటే: 

ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి నాలుక గులాబీ రంగులో ఉంటుంది. కానీ కొంతమందికి నాలుక తెల్లగా కనిపిస్తుంటుంది. దీని వెనుక ఫంగల్ ఇన్ఫెక్షన్ (కాండిడా), ల్యూకోప్లేకియా, ఓరల్ లైకెన్ ప్లేనస్, నోరు, దంతాలు శుభ్రం చేసుకోకపోవడ, నీరు తక్కువగా తాగడం, సిఫిలిస్, డయాబెటిస్ లాంటి సమస్యలకు సంకేతంగా చెప్పొచ్చు. 
 

36

ఎరుపు రంగులో ఉంటే: 

నాలుక ఎరుపు రంగులో ఉంటే విటమిన్ B12 లేదా ఐరన్ లోపం, జ్వరం, కవాసకి డిసీజ్, ఫుడ్ అలర్జీలు లేదా మందుల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్, గ్లాసైటిస్ (నాలుకలో వాపు) వంటి ల‌క్ష‌ణాలు కావొచ్చు. 

46
tongue health

ఎరుపు రంగులో ఉంటే: 

నాలుక ఎరుపు రంగులో ఉంటే విటమిన్ B12 లేదా ఐరన్ లోపం, జ్వరం, కవాసకి డిసీజ్, ఫుడ్ అలర్జీలు లేదా మందుల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్, గ్లాసైటిస్ (నాలుకలో వాపు) వంటి ల‌క్ష‌ణాలు కావొచ్చు. 

56
swollen tongue

నలుపు లేదా నీలం రంగు నాలుక:

నాలుక ఈ రంగులోకి మారితే నోటి పరిశుభ్రతలేమి, పొగ తాగేవారిలో, ఊపిరితిత్తుల సమస్యలు, రక్త సంబంధిత రుగ్మతలు వంటి వాటికి ల‌క్ష‌ణం కావొచ్చు.

66
Not ominous…. Due to this the tongue turns black

గ్రే లేదా లైట్ వైట్ షేడ్: 

నాలుక ఈ రంగులోకి మారితే.. చర్మ వ్యాధులు, గజ్జి, తామర, జీర్ణ సమస్యలు వంటి ల‌క్ష‌ణాలుగా భావించాలి. 

నోట్‌: ఈ వివ‌రాల‌ను ప్రామాణికంగా తీసుకోకూడ‌దు. నాలుక రంగులో మార్పులను గమనించిన వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి. 

Read more Photos on
click me!

Recommended Stories