Liver: లివర్ సిర్రోసిస్ అనేది చాలా తీవ్రమైన సమస్య. దీర్ఘకాలిక కాలేయ వ్యాధుల వల్ల లివర్ కణాలు దెబ్బతిని, కాలేయం కుచించుకుపోతుంది. అధికంగా ఆల్కహాల్ తాగడం, హెపటైటిస్ బి, సి వైరల్ ఇన్ఫెక్షన్లు, ఫ్యాటీ లివర్ దీనికి ప్రధాన కారణాలు.
లివర్ సిర్రోసిస్ ; మీరు తప్పక తినకూడని ఏడు ఆహారాలు
లివర్ సిర్రోసిస్ అనేది దీర్ఘకాలిక కాలేయ వ్యాధుల వల్ల కాలేయ కణాలు దెబ్బతిని, లివర్ కుచించుకుపోయే తీవ్రమైన పరిస్థితి. అధికంగా ఆల్కహాల్ తాగడం, హెపటైటిస్ బి, సి వైరస్ ఇన్ఫెక్షన్, ఫ్యాటీ లివర్ దీనికి ప్రధాన కారణాలు.
ముందుగా గుర్తిస్తే ఆహారం, వ్యాయామంతో దీనిని నియంత్రించవచ్చు
ఆల్కహాలిక్, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధుల వల్ల లివర్ సిర్రోసిస్ వస్తుంది. ఫ్యాటీ లివర్ సమస్యను చాలావరకు తగ్గించుకోవచ్చు. కానీ సిర్రోసిస్ వల్ల కలిగే నష్టం శాశ్వతంగా ఉంటుంది. అయితే, వ్యాధిని ముందుగానే గుర్తిస్తే.. సరైన ఆహారం, వ్యాయామంతో దీనిని నియంత్రించవచ్చు.
29
లివర్ సిర్రోసిస్ ఉంటే మీరు తినకూడని కొన్ని ఆహారాలు ఇవే.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు, కొన్ని అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. మీకు లివర్ సిర్రోసిస్ ఉంటే, మీరు కచ్చితంగా కొన్ని ఆహార పదార్థాలను తినకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
39
సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలను తప్పక మానెయ్యాలి.
సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలకు కచ్చితంగా దూరంగా ఉండాలి. సిర్రోసిస్ రోగులలో సోడియం.. శరీరంలో ద్రవాలు నిలిచిపోయేలా చేసి, కాళ్ల వాపులకు కారణమవుతుంది. క్యాన్డ్ సూప్‌లు, చిప్స్, ప్రాసెస్ చేసిన స్నాక్స్, పచ్చళ్లు, ఇన్‌స్టంట్ నూడుల్స్ వంటి వాటిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. సో వాటికి దూరంగా ఉండటం బెటర్.
కొద్దిపాటి ఆల్కహాల్ కూడా వాపు, ఆక్సిడేటివ్ ఒత్తిడికి దారితీస్తుంది.
కొంచెమే కదా అని ఆల్కహాల్ తాగినా సరే అది ఆరోగ్యకరమైన కాలేయ కణాలను నాశనం చేస్తుంది. ఫైబ్రోసిస్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. కాలేయం ఇతర పనుల కంటే ఆల్కహాల్‌ను జీర్ణం చేయడానికే ప్రాదాన్యత ఇస్తుంది. దీనివల్ల శరీరంలో విష పదార్థాలు పేరుకుపోయి, వాపు, ఆక్సిడేటివ్ ఒత్తిడికి దారితీస్తుంది.
59
ఫ్రెంచ్ ఫ్రైస్, పకోడీ, సమోసా, ఫాస్ట్ ఫుడ్ బర్గర్‌ల వంటి వేయించిన ఆహారాలు
ఫ్రెంచ్ ఫ్రైస్, పకోడీ, సమోసా, ఫాస్ట్ ఫుడ్ బర్గర్‌ల వంటి వేయించిన ఆహారాలు కాలేయంపై అదనపు భారం మోపుతాయి. వీటిలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్, ప్రిజర్వేటివ్స్ వల్ల కొవ్వు పేరుకుపోవడం, దీర్ఘకాలిక వాపు వంటి సమస్యలు వస్తాయి. ఇవి సిర్రోసిస్ నష్టాన్ని మరింత పెంచుతాయి. అంతేకాదు, పేగుల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి.
69
రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం జీర్ణం కావడం కష్టం
రెడ్ మీట్ (బీఫ్, మటన్, పంది మాంసం), ప్రాసెస్ చేసిన మాంసం (సాసేజ్‌లు, సలామీ, కబాబ్‌లు) జీర్ణం కావడం కష్టం. వీటిలో సంతృప్త కొవ్వులు, కాలేయంలో వాపును కలిగించే 'హీమ్ ఐరన్' ఎక్కువగా ఉంటాయి. అధిక కొలెస్ట్రాల్ రక్త ప్రవాహాన్ని దెబ్బతీసి, కాలేయంపై పరోక్షంగా ఒత్తిడి పెంచుతుంది.
పచ్చిగా ఉన్నా లేదా సరిగా ఉడకని షెల్ఫిష్ (రొయ్యలు, ఆల్చిప్పలు), పచ్చి గుడ్లు ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. వీటిలోని క్రిములు బాక్టీరియల్ పెరిటోనిటిస్ లేదా సెప్సిస్‌కు కారణమవుతాయి. ఇది సిర్రోసిస్ రోగులకు చాలా ప్రమాదకరం. బాక్టీరియాను ఫిల్టర్ చేసే కాలేయ సామర్థ్యం తగ్గడం వల్ల ఈ ముప్పు మరింత పెరుగుతుంది. మాంసాన్ని 165°F (74°C) వద్ద, సీ ఫుడ్‍ను వేడి ఆవిరిపై బాగా ఉడికించాలి.
89
సోడాలు, స్వీట్లు, పేస్ట్రీలు, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు
సోడాలు, క్యాండీలు, పేస్ట్రీలు, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు (వైట్ రైస్, మైదా బ్రెడ్) రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్‌కు దారితీస్తుంది. హై-ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ నుంచి వచ్చే అదనపు ఫ్రక్టోజ్ నేరుగా కాలేయ కణాలను దెబ్బతీసి, ఫైబ్రోసిస్‌కు కారణమవుతుంది. ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
కొవ్వు ఎక్కువగా ఉండే పాలు, వెన్న, పనీర్, నెయ్యి, క్రీమీ చీజ్‌లు కాలేయంలో సంతృప్త కొవ్వులను నింపుతాయి. ఇది గాల్‌స్టోన్స్ (పిత్తాశయంలో రాళ్లు) ప్రమాదాన్ని పెంచడమే కాకుండా, కాలేయంలో వాపును మరింత తీవ్రతరం చేస్తుంది.