Warm Water: డైట్ పేరుతో కడపు మాడ్చుకునే అవసరం లేదు. అలాగే కేవలం డైట్తో ఆరోగ్యంగా ఉంటామనుకోవడం కూడా పొరపాటే. చిన్న మార్పులతో హెల్దీగా, యాక్టివ్‍గా ఉండొచ్చు. అయితే ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీళ్లు తాగితే ఎన్ని లాభాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ భూమ్మీద జీవించే ప్రతి జీవికి గాలి, నీరు, ఆహారం చాలా అవసరం. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా బతకడం కష్టం. అందులో చాలా ముఖ్యమైన భాగం. చాలా మందికి నీరు తాగడమంటే ఓ బద్ధకం. అంతేకాకుండా కొంతమంది చాలా అయిష్టంగా, నామూషీగా ఫీలవుతారు. నీళ్లు తాగితే వాష్ రూంకు వెళ్లాల్సి వస్తుందని అనుకుంటారు. నీరు తాగడం వల్లే మలమూత్రం రూపంలో శరీరంలోని వ్యర్థాలు బయటకెళ్లేది. నీరు తాగడం తగ్గిస్తే ముఖంపై మొటిమలు, డీహైడ్రేషన్, జుట్టు రాలిపోవడం, కళ్లు తిరిగిపడిపోవడం వంటివి జరుగుతుంటుంది. అయితే పరగడుపున తాగే నీటి వల్ల శరీరానికి బోల్డెన్ని లాభాలున్నాయి.
25
గోరువెచ్చని నీటితో వ్యాధులకు దూరం
ఉదయం నిద్ర లేవగానే గోరువెచ్చని నీరు తాగి మీ రోజును ప్రారంభించాలి. ఖాళీ కడుపుతో ఒక గ్లాసు నీరు తాగితే శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఒక్క నీరే అనేక వ్యాధుల నుండి కూడా కాపాడుతుంది. జీవితంలో అనేక చిన్న అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా, పెద్ద ప్రయోజనాలను పొందవచ్చు. కేవలం నీరు మాత్రమే ఎన్నో సమస్యలను క్షణాల్లో పరిష్కరిస్తుంది. అయితే నీళ్లు తాగే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. లేకపోతే అది మీ శరీరానికి మంచి బదులు చెడు జరిగే ప్రమాదం ఉంది. నీళ్లు మరీ వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉంచుకోవాలి. ఉదయం నిద్రలేవగానే బ్రష్ చేయడానికి ముందైనా, తర్వాతైనా నీళ్లు తాగవచ్చు.
35
ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది
ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిని తాగడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇది శరీరంలోని మలినాలను బయటకు పంపడం ద్వారా, లోపలి నుండి శరీరాన్ని శుభ్రపరచడానికి కూడా సహాయపడుతుంది. దీనివల్ల మీరు రోజంతా యాక్టివ్‍గా ఉంటారు.
జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది
చాలా మందికి జీర్ణ సమస్యలు ఉంటాయి. ప్రతిరోజూ గోరువెచ్చని నీటిని తాగడం వల్ల మీ జీర్ణవ్యవస్థ బలపడి, ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి.
బరువు తగ్గడానికి డైట్ అవసరం లేదు..నీరు తాగితే చాలు
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగడం కూడా బరువు పెరగడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయం పూట నీరు తాగడం వల్ల జీవక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. కేలరీలు వేగంగా ఖర్చవుతాయి, ఆకలి తగ్గుతుంది, దీనివల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది.
మెరిసే చర్మం
ప్రకాశవంతమైన చర్మం కావాలంటే, ప్రతి ఉదయం గోరువెచ్చని నీటిని తాగాలి. ఇది మీ చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది మీ ముఖాన్ని మెరిసేలా కాకుండా, ముడతలు, మొటిమల వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.
55
రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటి వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, సరైన రక్త ప్రవాహం జరుగుతుంది. అంతేకాకుండా, ఇది శరీరంలోని అన్ని భాగాలకు తగినంత ఆక్సిజన్ సరఫరాను కూడా అందిస్తుంది.