బీపీ పెరగడానికి ప్రధాన కారణం ఉప్పు. అందుకే మీరు రక్తపోటును కంట్రోల్ లో ఉంచుకోవాలంటే ఉప్పును తగ్గించాలి. అలాగే ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలను మానేయాలి. మీరు రోజూ తినే ఫుడ్ లో ఉప్పును తగ్గించి మసాలా దినుసులను వాడి ఫుడ్ టేస్ట్ ను పెంచండి.
దీనివల్ల మీ శరీరంలో నీటి నిల్వ తగ్గుతుంది. అలాగే రక్తనాళాల్లో ఒత్తిడి తగ్గుతుంది. మీరు రోజూ అరటిపండ్లు, టమాటాలు, ఆకు కూరలు, అవకాడో, చిలగడదుంపలు వంటి ఆహారాలను బాగా తనిండి. ఇవి సోడియం ను మీ శరీరంలోంచి బయటకు పంపడానికి సహాయపడుతుంది. అలాగే రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.