ఇలా నిద్రపోతే సమస్యలు తప్పవు

Published : Aug 24, 2025, 05:14 PM IST

మనం పడుకునే భంగిమ వల్ల కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు ఎలా పడుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

PREV
16
స్లీపింగ్ పొజీషన్

మనం కంటినిండా నిద్రపోతేనే మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. నిద్ర శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం. రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోకపోతే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే నిద్ర ఒక్కటే కాదు.. నిద్రపోయే విధానం కూడా ముఖ్యమంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే కొన్ని పొజీషన్లలో నిద్రపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది.

నిపుణుల ప్రకారం.. రాంగ్ పొజీషన్ లో నిద్రపోతే సరిగ్గా నిద్రపట్టదు. అలాగే మీరు కొన్ని దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తప్పుడు భంగిమలో నిద్రపోవడం వల్ల వచ్చే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

26
ఎలాంటి పొజీషన్లలో నిద్రపోకూడదు?

పొట్ట మీద పడుకోవడం..

కొంతమందికి పొట్ట మీదే పడుకుంటారు. ఇలా పడుకుంటే వెంటనే నిద్రపడుతుందని చెప్తుంటారు. కానీ ఇలా నిద్రపోవడం చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ పొజీషన్ లో నిద్రపోవడం వల్ల వెన్నెముక దాని సహజ స్థితిలో ఉండదు. దీనివల్ల మెడపై, వెనక భాగంపై బాగా ఒత్తిడి పడుతుంది.

మెడ, వెన్నెముక సమస్యలు: మీరు పొట్టమీద పడుకున్నప్పుడు శ్వాస తీసుకోవాలంటే తలను ఒక వైపు తిప్పి నిద్రపోవాలి. దీనివల్ల మెడ కండరాలలో ఒత్తిడి కలుగుతుంది. అలాగే నొప్పి కలుగుతుంది. ఈ పొజీషన్ వల్ల తలనొప్పి, గర్భాశయ నొప్పి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటంటే?

36
పొట్ట మీద పడుకోవడం..

జీర్ణవ్యవస్థపై ప్రభావం: మీరు ఎప్పుడూ పొట్టమీద పడుకోవడం వల్ల కడుపుపై ఒత్తిడి పడుతుంది. దీంతో మీ జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. ఎసిడిటీ సమస్య వస్తుంది.

ముఖంపై ముడతలు: పొట్టపై పడుకునే వారు దిండుపై ముఖాన్ని అటూ ఇటూ రుద్దుతూనే ఉంటారు. దీనివల్ల ముఖంపై గీతలు, ముడతలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.

46
తలకింద చేయి పెట్టుకుని పడుకోవడం

చాలా మంది తలకింద దిండును వేసుకోరు. కానీ చేయిని పెట్టుకుని మాత్రం పడుకుంటుంటారు. ఈ అలవాటు చాలా మందికి ఉంటుంది. నిజానికి ఈ పొజీషన్ కంఫర్ట్ గా అనిపిస్తుంది. కానీ దీనివల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటంటే?

రక్త ప్రసరణకు ఆటంకం: తలకింద చేయి పెట్టుకుని నిద్రపోవడం వల్ల రక్తనాళాలపై, చేతి నరాలపై ఒత్తిడి కలుగుతుంది. దీనివల్ల చేయి తిమ్మిరి పడుతుంది. అలాగే నొప్పి పెడుతుంది. ఇలా ఎక్కువ కాలం గనుక కొనసాగితే చేతి నరాలు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భుజం కీళ్ల నొప్పులు: తలకింద చేయిని దిండులా పెట్టుకుని పడుకుంటే మీ శరీర బరువంత ఒకే భుజం, చేయిపై పడుతుంది. దీనివల్ల భుజంలోని కీళ్లలో నొప్పి కలుగుతుంది

56
సగం పడుకుని, సగం కూర్చోవడం

సగం పడుకుని, సగం కూర్చోవడం వల్ల కూడా లేనిపోని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పొజీషన్ లో మనం ఎక్కువగా టీవీ చూస్తున్నప్పుడు చేస్తాం. అంటే మంచంపై, దిండుపై ఈ పొజీషన్ లో ఎక్కువగా ఉంటాం. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయంటే?

వెన్నెముకపై ఒత్తిడి: సగం పడుకుని, సగం కూర్చొనే పొజీషన్ లో ఉండటం వల్ల మన వెన్నెముక సి ఆకారంలో వంగుతుంది. ఇది డిస్క్ పై ఒత్తిడిని కలిగిస్తుంది. అలాగే వెన్ను నొప్పికి దారితీస్తుంది.

మెడ నొప్పి: మీరు ఎక్కువగా ఈ పొజీషన్ లో నిద్రపోవడం వల్ల మీ తలకు సరైన మద్దతు దొరకదు. అలాగే ఒకవైపు వేళాడుతున్నట్టుగా ఉంటుంది. దీనివల్ల మీ మెడకండరాలలో ఒత్తిడి కలుగుతుంది. అలాగే విపరీతంగా నొప్పి పెడుతుంది.

66
గర్బంలో ఉన్న బిడ్డలా నిద్రపోవడం

చాలా మంది గర్భంలో ఉన్న బిడ్డలా నిద్రపోతుంటారు. అంటే మోకాళ్లను వంచేసి తల వంచుకుని నిద్రపోతుంటారు. ఈ పొజీషన్ ఎంతో కంఫర్ట్ గా ఉంటుంది. కానీ ఇలా ఎక్కువ సేపు నిద్రపోవడం మంచిది కాదు. దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయంటే?

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది: ఈ భంగిమలో ఎక్కువ సేపు పడుకోవడం వల్ల ఊపిరితిత్తులపై, డయాఫ్రాగమ్ పై బాగా ఒత్తిడి పడుతుంది. దీంతో మీకు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఈ పొజీషన్ వల్ల మీ శరీరానికి సరైన ఆక్సిజెన్ అందదు.

వెన్ను, మెడ నొప్పి: ఈ పొజీషన్ లో ఎక్కువ సేపు పడుకుంటే వెన్నెముకలో నొప్పి కలుగుతుంది. ఇక ఉదయం లేవగానే వీపు కీళ్లు బాగా నొప్పి పెడతాయి.

Read more Photos on
click me!

Recommended Stories