చాయ్ ని ఎక్కువ సేపు మరిగిస్తున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే

Published : Aug 23, 2025, 06:35 PM IST

టీ అంటే చాలా మందికి ఇష్టం. ఉదయం, సాయంత్రం ఖచ్చితంగా టీని తాగుతుంటారు. అయితే టీ టేస్టీగా కావాలంటే మాత్రం దీన్ని బాగా మరిగించాల్సిందేనంటారు. కానీ టీని ఎక్కువ సేపు మరిగిస్తే ఏమౌతుందో తెలుసా?

PREV
16
చాయ్

కాఫీ కంటే చాలా మంది టీ నే ఇష్టపడతారు. అందుకే ఉదయం లేచిన తర్వాత సాయంత్రం ఖచ్చితంగా కప్పు టీని తాగేస్తుంటారు. అయితే చాలా మంది టీని బాగా మరిగిస్తుంటారు. దీనివల్ల టీ టేస్ట్ బాగుంటుందని. కానీ టీని ఎక్కువ సేపు మరిగించి తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సేపు మరిగించిన చాయ్ ని తాగడం వల్ల వచ్చే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

26
రక్తహీనత

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చాయ్ ని ఎక్కువ సేపు మరిగిస్తే దానిలో టానిన్ అనే పదార్థం ఎక్కువ అవుతుంది. దీనివల్ల మన శరీరంలో ఇనుమ శోషణకు ఆటంకం కలుగుతుంది. దీనివల్ల మన శరీరంలో ఐరన్ లోపించి, రక్తహీనత సమస్య వస్తుంది. 

36
జీర్ణ సమస్యలు

చాయ్ లో టానిన్లు ఉంటాయి. అయితే చాయ్ ని ఐదు నిమిషాల కంటే ఎక్కువ సేపు మరిగిస్తే ఈ టానిన్ల లెవెల్స్ పెరుగుతాయి. ఇది మన జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అంతతేకాదు ఎక్కువ సేపు మరిగించిన చాయ్ లో pH లెవెల్స్ కూడా పెరుగుతాయి. దీనివల్ల బాగా దాహం వేస్తుంది. అలాగే గ్యాస్, ఎసిడిటీ, అజీర్థి వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.

46
పదే పదే వేడిచేయొద్దు

అయితే కొంతమంది ఒకేసారి చాయ్ ని ఎక్కువ పెట్టేసి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేడి చేసుకుని తాగుతుంటారు. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే టీని మళ్లీ మళ్లీ వేడిచేసుకుని తాగితే దానిలోని టానిన్ శాతం పెరిగి రక్తపోటు పెరుగుతుంది. అలాగే గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. 

56
పోషకాల నష్టం

చాయ్ లో పాలను కలుపుకుని తాగుతారు కాబట్టి మీరు దీనిని ఎక్కువ సేపు మరిగిస్తే పాలలో ఉండే విటమిన్ డి, ప్రోటీన్లు, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు తగ్గుతాయి. లేదా మొత్తమే నశిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పోషకాలు లేని చాయ్ ని తాగడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. 

66
టీ చేయడానికి సరైన పద్ధతి :

చాయ్ సరైన పద్దతిలో తయారుచేయడానికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. పాలు, నీళ్లు, పంచదార, టీ పౌడర్ అన్నీ కలిపి ఐదు నిమిషాలు మరిగించండి. అలాగే టీ పౌడర్ ను మరీ ఎక్కువగా కూడా వాడొద్దు. చాయ్ ని సరైన పద్దతిలో తయారుచేసి తాగితేనే మంచిది. లేదంటే మీరు లేనిపోని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories