Heart Attack Risk: గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే మెడిసన్.. మీరు వాడుతున్నారా ? ఒకసారి చెక్ చేసుకోండి!

Published : Jul 09, 2025, 04:57 PM IST

Heart Attack Risk: ఈ మధ్యకాలంలో చాలామంది డాక్టర్ సలహా లేకుండానే ఇష్టానుసారంగా మెడిసన్ వాడుతున్నారు. అయితే.. కొన్ని రకాల మందులు గుండెకు తీవ్రమైన నష్టాన్ని కలిగించి, గుండెపోటుకు కారణమవుతాయట. ఆ మందుల గురించి వివరంగా తెలుసుకుందాం. 

PREV
16
ఆ మందులు వాడితే గుండెకు ముప్పు!

ఈ మధ్యకాలంలో చాలామంది డాక్టర్ సలహా లేకుండానే ఇష్టానుసారంగా మెడిసిన్ వాడుతున్నారు. ఇలా ఇష్టానుసారంగా మందులు వేసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు, పలు దుష్ప్రభావాలు తలెత్తవచ్చు. గుండె నిపుణుల ప్రకారం.. కొన్ని సాధారణంగా వాడే పెయిన్ కిల్లర్లు, ఆంటీబయాటిక్స్, డీ-కంజెస్టెంట్లు వంటి మెడిసన్ వల్ల గుండె ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. అలాంటి కొన్ని మందుల గురించి తెలుసుకుందాం.  

26
నొప్పి మందులు

నొప్పి, వాపు తగ్గించేందుకు సాధారణంగా వాడే ఇబుప్రోఫెన్, నాప్రోక్సెన్ వంటి మందులు  అతిగా వాడితే గుండెపోటు, బీపీ, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ మందులు గుండెపై ఒత్తిడిని పెంచి, రక్తనాళాలపై ప్రభావం చూపుతాయి. గుండె సమస్యలు ఉన్నవారు ఈ మందులను డాక్టర్ సూచనలతో మాత్రమే వాడాలి. ఈ మెడిసిన్ వేసుకునే ముందు రక్తపరీక్షలు చేయించుకుని, ఫలితాలను వైద్యునికి చూపించాలి. స్వీయంగా మందులు వాడటం ప్రమాదకరం.

36
జలుబు మందుల ప్రభావం

జలుబు, దగ్గు మందుల్లో ఉండే డీకన్‌జెస్టెంట్లు (ఉదా: ఫెనైల్‌ఎఫ్రిన్, ప్సెయూడోఎఫెడ్రిన్) రక్తనాళాలను సంకోచింపజేసి బీపీని పెంచుతాయి, గుండెకు అధిక భారం కలిగిస్తాయి. ఇవి హృదయ స్పందన వేగం, రక్తపోటు పెరగడం, ఛాతీ మడమలు వంటి సమస్యలు కలిగించవచ్చు. గుండె జబ్బులు ఉన్నవారు ఈ రకమైన మందులను వాడితే, పరిస్థితి మరింత విషమించవచ్చు. అందుకే జలుబు లేదా దగ్గు వచ్చినప్పుడు కూడా డాక్టర్ సలహా లేకుండా మందులు వాడకూడదు. మెడిసిన్ వాడేముందు ఎప్పుడూ వైద్యుని అభిప్రాయం తీసుకోవాలి.

46
షుగర్ మందులు – గుండెకు ముప్పు!

గతంలో షుగర్ నియంత్రణ కోసం వాడే రోసిగ్లిటాజోన్ వంటి మందులు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో సహాయపడినప్పటికీ, గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయంటూ పలు అధ్యయనాలు హెచ్చరించాయి. ఈ మందులు గుండె జబ్బుల బారిన పడే అవకాశాన్ని పెంచినట్టు పరిశోధనల్లో తేలింది. కాబట్టి, షుగర్ ఉన్నవారు ఎప్పుడూ డాక్టర్ సలహాతోనే మందులు వాడాలి. ఇష్టానుసారంగా మందులు వాడటం గుండె ఆరోగ్యానికి ప్రమాదకరం.

56
కీమోథెరపీ మందులతో గుండెకు ముప్పు

కీమోథెరపీ మందులు కూడా గుండెకు ముప్పు కలిగిస్తాయి. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ మందులు కొన్ని సందర్భాల్లో గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా డాక్సోరూబిసిన్, ట్రాస్టుజుమాబ్ వంటి మందులు ఎక్కువకాలం వాడితే, గుండె కండరాలు బలహీనపడే అవకాశం ఉంది.

ఈ మందుల ప్రభావంతో గుండెపోటు, గుండె బలహీనత వంటి సమస్యలు తలెత్తవచ్చు. అందుకే కీమోథెరపీ తీసుకునే క్యాన్సర్ పేషెంట్లు చికిత్స సమయంలో, తర్వాత కూడా గుండె పరీక్షలు (ఇకో, ఈసీజీ) తప్పనిసరిగా చేయించుకోవాలి.

66
మానసిక సమస్యలకు వాడే కొన్ని మందులు

డిప్రెషన్, ఆందోళన, మానసిక అనస్థితి వంటి సమస్యలకు వాడే కొన్ని యాంటీడిప్రెసెంట్లు, యాంటీ సైకోటిక్ మందులు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మందులు గుండె వేగం మారడం, గుండె దడ వంటి సమస్యలకు దారితీయవచ్చు. ఈ మందులు వాడే సమయంలో మైకము, అసహజ గుండె ధోరణులు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

గమనిక: పైన ఇచ్చిన సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది గుండె జబ్బుల నిపుణులు విడుదల చేసిన వీడియోల ఆధారంగా సేకరించిన సమాచారం. దీనికి ఆసియా నెట్ తెలుగు ఎలాంటి బాధ్యత వహించదు. ఏదైనా మందు వాడే ముందు లేదా ఆపే ముందు డాక్టర్‌ని సంప్రదించడం తప్పనిసరి. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి డాక్టర్ మాత్రమే సరైన సలహాలు ఇవ్వగలరు. గుండె ఆరోగ్యం గురించి ఏవైనా సందేహాలుంటే డాక్టర్‌ని సంప్రదించండి.

Read more Photos on
click me!

Recommended Stories