కూరల్లో ఉప్పు ఎక్కువగా ఉన్నా తినేస్తున్నారా? ఈ 5 రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి జాగ్రత్త

Naga Surya Phani Kumar | Updated : May 11 2025, 08:20 AM IST
Google News Follow Us

ఏ ఫుడ్ ఐటమ్ అయినా టేస్టీగా ఉండాలంటే ఉప్పు కరెక్ట్ గా వేయాలి కదా.. కాని కొందరు కాస్త ఉప్పు ఎక్కువగా ఉన్నా ఆస్వాదిస్తూ తినేస్తారు. ఇలా రోజూ ఉప్పు ఎక్కువగా తీసుకొనే వారు 5 రకాల హైరిస్క్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొనాల్సి వస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఆ ఆరోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

15
కూరల్లో ఉప్పు ఎక్కువగా ఉన్నా తినేస్తున్నారా? ఈ 5 రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి జాగ్రత్త

గుండెకు ప్రమాదం

అధిక ఉప్పు శరీరంలో సోడియం స్థాయిలను పెంచుతుంది. ఇది రక్త నాళాలలో నీటిని నిలిపి, రక్త పరిమాణాన్ని పెంచుతుంది. దీనివల్ల గుండెపై ఒత్తిడి పెరిగి హై బీపీ కి దారితీస్తుంది. అధిక రక్తపోటు గుండె జబ్బులు, స్ట్రోక్, గుండెపోటు వంటి ప్రమాదాలను పెంచుతుంది. ఎక్కువ ఉప్పు తినడం వల్ల గుండె కండరాలు ప్రభావితం అవుతాయి. గుండె ఆగిపోవడానికి ఛాన్స్ పెరుగుతుంది. 

25

ఉబ్బరం సమస్య

ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల కడుపులో, శరీరమంతా ఉబ్బరం వస్తుంది. ముఖ్యంగా ఎక్కువ సోడియం ఉన్న ఆహారాలు తిన్న తర్వాత ఈ సమస్య ఎదురవుతుంది. శరీరంలో ఎక్కువ సోడియం ఉన్నప్పుడు దాన్ని పలుచన చేయడానికి శరీరం ఎక్కువ నీటిని స్టోర్ చేసుకుంటుంది. ఇది కడుపు ఉబ్బరానికి కారణమవుతుంది.

35

రక్తపోటు సమస్య

ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల వచ్చే ప్రధాన సమస్య ఏంటంటే అధిక రక్తపోటు. ఉప్పులోని సోడియం రక్తనాళాలను చిన్నదిగా చేసి రక్త ప్రసరణ సజావుగా సాగనివ్వదు. దీంతో రక్తపోటు పెరుగుతుంది. ప్రారంభంలో లక్షణాలు కనిపించకపోయినా దీర్ఘకాలిక అధిక రక్తపోటు మూత్రపిండాలు, గుండె, మెదడుకు హాని కలిగిస్తుంది. రక్తపోటు ఉన్నవారు ఉప్పు తగ్గించడం చాలా ముఖ్యం.

45

మూత్రపిండాల సమస్యలు

శరీరంలోని అదనపు ద్రవాలు, వ్యర్థాలను బయటకు పంపడంలో మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఎక్కువ ఉప్పు తీసుకున్నప్పుడు, మూత్రపిండాలు అదనపు సోడియంను బయటకు పంపడానికి ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. దీర్ఘకాలంలో ఇది మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కిడ్నీ వ్యాధులు సోకడానికి ఛాన్స్ పెరుగుతుంది. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడటానికి కూడా అధిక ఉప్పు ఒక కారణం.

55

చర్మ సమస్యలు

అధిక ఉప్పు తీసుకోవడం చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. శరీరంలో నీరు నిలిచిపోవడం వల్ల చర్మం ఉబ్బి, మెరుపు కోల్పోతుంది. కొన్ని అధ్యయనాలు అధిక ఉప్పు తీసుకోవడం వల్ల తామర వంటి చర్మ సంబంధం వ్యాధులు వస్తాయి. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు చర్మం పొడిబారుతుంది.

Read more Photos on
Recommended Photos