Walking Benefits: నడక నాలుగు విధాలుగా మేలని వైద్యులు చెబుతుంటారు. ముఖ్యంగా 60ఏళ్లు పైబడినవారు వాకింగ్, జాగింగ్ చేయడం వల్ల ప్రమాదకర రోగాల నుంచి రక్షణ పొందవచ్చని పలు అధ్యయనాలు స్పష్టంచేశాయి. అయితే.. 60 ఏళ్లు పైబడిన వారు రోజూ ఎంత దూరం నడిస్తే ఉత్తమం అనే విషయాలు తెలుసుకుందాం.
నడక ఆరోగ్యానికి మాత్రమే కాదు.. మెదడు పనితీరు కూడా దోహదపడుతుంది. నడక వల్ల జ్ఞాపకశక్తి, అభ్యాసానికి అవసరమైన మెదడులోని హిప్పోకాంపస్ పనితీరు మెరుగుపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందుకోసం ప్రతిరోజూ గంటల తరబడి నడవాలని అవసరం లేదనీ, వారంలో మూడు రోజులు కేవలం 40 నిమిషాలు నడిచినా సరిపోతుందట. ఇలా చేయడం వల్ల అభ్యాస సామర్థ్యం పెరుగుతుందట.
24
అధ్యయన అంశాలు
నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ప్రచురించబడిన అధ్యయనంలో చిత్తవైకల్యం లేని 120 మంది వృద్ధులను ఎంపిక చేశారు. వారిని రెండు గ్రూపులుగా విభజించారు. ఇందులో ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకునే వారు, అధికంగా శ్రమించేవారని గ్రూపులుగా చేశారు. వీరిని సంవత్సరం పాటు పరిశీలించినప్పుడు.. ఏరోబిక్ వ్యాయామం చేసిన వారి హిప్పోకాంపస్ పరిమాణం సగటున 2% పెరిగినట్లు కనుగొన్నారు. వ్యాయామం చేయని మరొక గ్రూపులో హిప్పోకాంపస్ పరిమాణం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ అధ్యయనంలో అభ్యాసం, జ్ఞాపకశక్తికి సంబంధించిన మెదడులోని న్యూరోట్రోఫిక్ కారకం (BDNF) స్థాయిలతో హిప్పోకాంపస్ పరిమాణాలు సంబంధం కలిగి ఉన్నాయని కనుగొన్నారు.
34
మెదడు పనితీరు
వయసు పెరిగే కొద్దీ వారి జ్ఞాపకశక్తి, లో గణనీమైన మార్పులు వస్తాయి. మెదడులోని హిప్పోకాంపస్ పరిమాణం తగ్గడం వల్ల.. వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గుతుంది. అలాగే.. కొత్త విషయాలను గుర్తుపెట్టుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. దీనితో పాటు దీర్ఘకాలిక ఒత్తిడి, సరిగా నిద్రపోకపోవడం, వంటివి కూడా మెదడు పనితీరు ప్రభావం చూపుతాయి. కానీ క్రమం తప్పకుండా వ్యాయామం, నడక, ఏరోబిక్, ఆరోగ్యకరమైన ఆహారం, మానసిక స్థితి సమతుల్యంగా ఉండటం వంటివి హిప్పోకాంపస్ కుంచించుకుపోవడాన్ని ఆలస్యం చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
ప్రతిరోజూ 40 నిమిషాలు నడవడం వల్ల మీ మెదడు పనితీరులో మార్పులు రావచ్చు. ఇది మంచి వ్యాయామం. ఈ 40 నిమిషాలను 20 నిమిషాలుగా విభజించి ఉదయం, సాయంత్రం వేర్వేరు సెషన్‌లుగా నడవవచ్చు. వారంలో కనీసం మూడు రోజులు నడిచినా సరిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వీలుంటే.. ప్రతిరోజూ నడవగలిగితే అది మరింత మంచిది.