ఇంట్లో రోజ్ మేరీ పెంచడం వల్ల దాని ఘాటైన వాసన వల్ల పాములు ఇంటి లోకి రావు.
వెల్లుల్లి కూడా ఘాటైన వాసన కలిగి ఉంటుంది. అందువల్ల పాములు రావు. దీన్ని నూరిన లేదా రసం చల్లినా పాములు పారిపోతాయి.
ఈ పూల మొక్క కేవలం సువాసన, అందం కోసమే కాదు. పాములను తరిమికొట్టడానికి కూడా సహాయపడుతుంది.
చామంతి పువ్వుల వేర్లలో ఉండే సహజ సుగంధం పాములను మాత్రమే కాకుండా ఇతర జీవులు, కీటకాలను కూడా ఇంట్లోకి రాకుండా చేస్తుంది.
కాక్టస్ మొక్కలలో ముళ్ళు ఉండటం వల్ల పాములను ఆకర్షించవు. కాబట్టి కాక్టస్ మొక్కలను చూస్తే పాములు దగ్గరికి రావు.
లెమన్ గ్రాస్ లో సిట్రోనెల్లా ఉంటుంది. కీటకాలను, ఇతర జంతువులను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇంటి ముందు ఈ మొక్కలను పెంచుకుంటే పాములు రావు.
ఉల్లిపాయలో సల్ఫర్ ఉంటుంది. దీని వాసన పాములకు ఇబ్బంది కలిగిస్తుంది. అందువల్ల ఇంటి ముందు ఇతర మొక్కలతో పాటు ఉల్లిపాయలను పెంచడం మంచిది.