ప్రస్తుతం చాలామంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. గజిబిజి లైఫ్ స్టైల్, చెడు ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వంటివి ఇందుకు కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అవేంటో చూద్దాం.
ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా అందరూ షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే జీవనశైలి మార్పుల ద్వారా డయాబెటిస్‌ను నియంత్రించవచ్చు అంటున్నారు నిపుణులు. మరి డయాబెటిస్ ఉన్నవారు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం.
26
షుగర్ లెవెల్స్..
డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా చెక్ చేయించుకోవాలి. ఆహార నియంత్రణ, వ్యాయామం, మాత్రలు, ఇన్సులిన్ ద్వారా షుగర్‌ను నియంత్రించవచ్చు. తక్కువ షుగర్ (హైపోగ్లైసీమియా), ఎక్కువ షుగర్ (హైపర్‌గ్లైసీమియా) రెండూ ప్రమాదకరం. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు రెండింటిపైనా దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. అధిక ఆకలి, దాహం, తలతిరగడం, మైకం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
36
ఆహారం విషయంలో జాగ్రత్త
డయాబెటిస్ ఉన్నవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలు మాత్రమే తీసుకోకుండా ప్రోటీన్, ఫైబర్, మంచి కొవ్వులను సరైన నిష్పత్తిలో తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన, చక్కెర ఆహారాలకు దూరంగా ఉండాలి. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, గింజలు, పప్పులను తీసుకోవాలి. సమయానికి భోజనం చేయడం వల్ల షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి.
రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో శరీర బరువు కీలక పాత్ర పోషిస్తుంది. బరువు పెరిగినప్పుడు ఇన్సులిన్ అవసరం పెరుగుతుంది. కాబట్టి ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. వ్యాయామం బరువు తగ్గడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలైనా నడవాలి. నడక, ఈత, సైక్లింగ్ వంటి మితమైన వ్యాయామాలు మంచివి. ఏదైనా వ్యాయామం ప్రారంభించే ముందు వైద్యుడి సలహా తీసుకోవడం ముఖ్యం.
56
కళ్లు, కాళ్ల విషయంలో జాగ్రత్త అవసరం..
డయాబెటిస్ ఉన్నవారికి ఉన్న అతిపెద్ద ముప్పు నరాలు దెబ్బతినడం. డయాబెటిస్ ఉన్నవారికి కాళ్లు, కళ్లలోని నరాలు దెబ్బతినవచ్చు. పాదాలకు పుండ్లు లేదా ఇన్ఫెక్షన్లు వచ్చి తీవ్రమైతే.. పాదాలను కోల్పోయే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి పాదాలను జాగ్రత్తగా చూసుకోవాలి. కాళ్లను శుభ్రంగా ఉంచుకోవడం, సరైన బూట్లు వేసుకోవడం, గోళ్లను జాగ్రత్తగా కత్తిరించడం వంటివి కాళ్లను రక్షిస్తాయి. పాదాలు మొద్దుబారడం, పుండ్లు రావడం లేదా గాజు వంటి వస్తువులు గుచ్చుకుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
66
రెగ్యులర్ రక్త పరీక్షలు
డయాబెటిస్ ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. మూడు నెలలకు ఒకసారి చేసే Hba1c, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయి, కిడ్నీ పనితీరు, కంటి పరీక్షలను రెగ్యులర్ గా చేయించుకోవాలి. డయాబెటిస్ సంబంధిత సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేసుకోవడం ఉత్తమం. వైద్యుల సలహా లేకుండా మందులు వాడటం మంచిదికాదు.