Costly Tea: ప్ర‌పంచంలో ఖ‌రీదైన టీ పౌడ‌ర్‌.. కిలో ఏకంగా కోటి రూపాయ‌లు

Published : May 21, 2025, 06:46 PM ISTUpdated : May 21, 2025, 08:09 PM IST

టీ అంటే ప‌డి చ‌చ్చే వాళ్లు మ‌న‌లో చాలా మంది ఉంటారు. కాస్త త‌ల నొప్పిగా ఉన్నా వెంట‌నే ఒక టీ తాగేస్తుంటారు. అయితే ప్ర‌పంచంలో అత్యంత ఖరీదైన టీ ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

PREV
15
టీ ప్ర‌స్థానం ఎక్క‌డ మొద‌లైంది.?

భార‌తీయులు టీ అంటే ఎంతో ఇష్ట‌ప‌డ‌తార‌ని మ‌న‌కు తెలిసిందే. అయితే టీ ప్ర‌స్థానం ప్ర‌పంచంలో మొట్ట‌మొద‌టిసారి చైనాలో మొద‌లైంద‌ని మీకు తెలుసా.? ప్రపంచంలోని టీలో సుమారు 35 శాతం చైనాలోనే వినియోగం జరుగుతోంది. చైనాలో పుట్టిన ఈ పానీయాన్ని ఇప్పుడు ప్రపంచమంతా ఎంతో ఇష్టంగా తాగుతున్నారు.

25
ఒక్క టీ రూ. 8 ల‌క్ష‌లు

మ‌న‌కు తెలిసినంత వ‌ర‌కు ఒక గ్లాసు టీ ధ‌ర రూ. 10 మ‌హా అయితే రూ. 100 ఉంటుంది క‌దూ! అయితే ఒక టీ బ్యాగ్ ధ‌ర ఏకంగా రూ.8 ల‌క్ష‌లు ఉంటే. న‌మ్మ‌డానికి వింత‌గా ఉన్నా ఇది నిజం. బూడిల్స్ జ్యూవెలర్స్ అనే సంస్థ, పీజీ టిప్స్ 75వ వార్షికోత్సవాన్ని గుర్తుగా వజ్రాలతో తయారైన టీ బ్యాగ్ తయారు చేసింది. దీని విలువ ఏకంగా 10,000 డాలర్లు. మ‌న క‌రెన్సీలో చెప్పాలంటే సుమారు రూ. 8 ల‌క్ష‌లు.

35
దీని ప్ర‌త్యేక‌త ఏంటంటే.?

ఈ టీ బ్యాగ్ ధ‌ర అంత ఎక్కువ‌నే సందేహం రావొచ్చు. అయితే ఈ టీ బ్యాగ్‌లో 2.56 క్యారెట్ల 280 వజ్రాలు ఉన్నాయి. పై భాగంలో బంగారు గొలుసుతో చిన్న తెల్ల బ్యాగ్ ఆకారంలో ఉంటుంది. ఇక బ్యాగులో టీ ఆకులు కూడా ఉంటాయి. దీని ధ‌ర ఇంత ఉండ‌డానికి ఇదే కార‌ణంగా చెప్పొచ్చు.

45
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన టీ

ఇది చైనాలో చాలా ప్రాచుర్యం పొందిన టీ. దీని పేరు డా హాంగ్ పావో (Da Hong Pao). ఈ టీ చాలా విలువైనది, దాని ధరను విన్నా మీరు షాక్ అవ్వాల్సిందే. ఒక కిలో డా హాంగ్ పావో టీ ధర సుమారు రూ. 1 కోటి వరకు ఉంటుంది. దీన్ని చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లో, వుయ్ పర్వతాల్లో పండిస్తారు. ఈ ప్రాంతంలో ఖనిజాలు అధికంగా ఉండటంతో, టీ రుచి ప్రత్యేకంగా ఉంటుంది

55
ఈ టీ ప్ర‌త్యేక‌త ఏంటంటే.?

ఈ టీ చెట్లు చాలా అరుదైనవి ప్రపంచంలో ఉన్న 6 చెట్ల నుంచే ఈ టీ వస్తుంది. ఈ చెట్లను చైనా ప్రభుత్వం జాతీయ వారసత్వంగా ప్రకటించింది. ఈ టీకి స‌హ‌జంగా వ‌చ్చే వాస‌న అద్భుతంగా ఉంటుంది. ఇక రుచి విష‌యంలో కూడా దీనిని కొట్టేది ఉండ‌ద‌ని చెబుతుంటారు. ఈ టీని లిక్విడ్ గోల్డ్ గా చెబుతుంటారు.

Read more Photos on
click me!

Recommended Stories