అధిక బరువు సమస్య ఈ మధ్యకాలంలో చాలా మందిని వేధిస్తోంది. ఆ బరువును తగ్గించుకోవడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తిండి తినడం తగ్గించేస్తారు. లేదంటే... కఠినమైన వ్యాయామాలు చేస్తూ ఉంటారు. ఇన్ని చేసినా కూడా తాము మాత్రం బరువు తగ్గడం లేదని ఫీల్ అయ్యేవారు చాలా మంది ఉన్నారు. అలాంటివారు... ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే చాలు. సింపుల్ వ్యాయామాలు చేసుకుంటూ... బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటూ, శరీరానికి అన్ని పోషకాలు అందేలా చూసుకుంటే, కచ్చితంగా బరువు తగ్గవచ్చు.
బరువు తగ్గడానికి సహజ చిట్కాలు
శరీరాన్ని శుభ్రపరచడానికి , జీవక్రియ సక్రమం చేయడానికి ఉదయం ఉత్తమ సమయం. కాబట్టి ప్రతిరోజూ ఉదయం కొన్ని కూరగాయల జ్యూస్ లు తాగడం ప్రారంభించాలి. ఇలా చేయడం వల్ల మీ అధిక బరువు చాలా ఈజీగా, సహజంగా తగ్గించవచ్చు. మరి, ఆ జ్యూస్ లు ఏంటో చూద్దామా...