Biryani: బిర్యానీ తిన్న తర్వాత పొరపాటున కూడా తినకూడనివి ఇవే..!

Published : Jul 17, 2025, 12:08 PM ISTUpdated : Jul 17, 2025, 12:37 PM IST

చాలా మందికి బిర్యానీ, కూల్ డ్రింక్ బెస్ట్ కాంబినేషన్. కానీ, పొరపాటున కూడా బిర్యానీ తిన్న తర్వాత అస్సలు కూల్ డ్రింక్స్ తాగకూడదు.

PREV
16
బిర్యానీ తిన్నాక ఏం తింటున్నారు?

బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్లు ఎవరైనా ఉంటారా? ముఖ్యంగా మన హైదరాబాదీలు బిర్యానీ తినడానికి చాలా ఎక్కువ మక్కువ చూపిస్తారు. చికెన్, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ అంటూ చాలా రకాలు ఉన్నాయి. రెగ్యులర్ గా ప్రతి వీకెండ్ బిర్యానీలు తినే వారు కూడా ఉంటారు. ఎంతో రుచికరమైన బిర్యానీ తిన్న తర్వాత.. కొన్ని రకాల ఫుడ్స్ కి కచ్చితంగా దూరంగా ఉండాలి. మరి, వేటికి దూరంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం...

26
1.కూల్ డ్రింక్స్...

బిర్యానీ తిన్న తర్వాత చాలా మంది కూల్ డ్రింక్స్ తాగాలని  అనుకుంటారు. బిర్యానీ మసాలాలతో స్పైసీగా ఉంటుంది. అది తిన్నప్పుడు కాస్త కారంగా అనిపించొచ్చు. అందుకే.. చాలా మందికి మనసు కూల్ డ్రింక్స్ వైపు లాగుతుంది. చాలా మందికి బిర్యానీ, కూల్ డ్రింక్ బెస్ట్ కాంబినేషన్. కానీ, పొరపాటున కూడా బిర్యానీ తిన్న తర్వాత అస్సలు కూల్ డ్రింక్స్ తాగకూడదు. అలా తాగడం వల్ల గ్యాస్ ట్రబుల్, అజీర్ణ, కడుపు ఉబ్బరం ( Bloating), గుండెలో మంట వంటి సమస్యలకు దారి తీస్తుంది. బిర్యానీ వేడి ఆహారం.. కూల్ డ్రింక్స్ చల్లగా ఉండటంతో శరీరంలో food-temperature imbalance కలుగుతుంది. ఇది ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది.

36
2. ఐస్ క్రీమ్, స్వీట్లు:

కొంతమంది బిర్యానీ తిన్న తర్వాత డెజర్ట్స్ తీసుకోవాలని అనుకుంటారు. ముఖ్యంగా ఐస్ క్రీమ్, స్వీట్లు తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. బిర్యానీలో ఉండే కొవ్వు పదార్థాలు బాడీలో ఫ్యాట్ గా మారే అవకాశం ఉంది. అలాంటి సమయంలో మళ్లీ షుగర్ ఎక్కువగా ఉండే డెజర్ట్స్ తీసుకోవడం అజీర్ణానికి దారితీస్తుంది. అధిక బరువు పెరగడానికి కూడా కారణం అవుతుంది.

46
3. పండ్లు , జ్యూస్:

కొంతమంది బిర్యానీ తిన్న వెంటనే పండ్లు తింటారు లేదా ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటారు. అయితే ఇది శరీరానికి మంచిది కాదు. బిర్యానీ మసాలా అధికంగా కలిగి ఉండే వంటకం. పండ్లలో ఉండే ఫైబర్, యాసిడ్ లక్షణాలు బిర్యానీ మసాలాలతో కలిపినప్పుడు జీర్ణవ్యవస్థలో అసహజమైన ప్రభావాన్ని కలిగించవచ్చు. ఇది గ్యాస్ట్రిక్ ట్రబుల్, అసిడిటీకి కారణం అవుతుంది.

56
4. మిల్క్ షేక్స్:

బిర్యానీ తిన్న తర్వాత కొంతమంది మిల్క్ షేక్స్ తాగే అలవాటు ఉంటుంది. అయితే ఇది పెద్ద తప్పే. బిర్యానీలో నాన్ వెజ్ పదార్థాలు ఉండటంతో, వాటి లోని ప్రోటీన్స్ శరీరంలో మిల్క్‌తో కలిపితే జీర్ణక్రియను ఆలస్యం చేస్తాయి. ఇది ఫుడ్ పాయిజినింగ్, అసిడిటీ కి కారణం అయ్యే అవకాశం ఉంటుంది.

66
5. టీ (చాయ్):

చాలామందికి భోజనం తర్వాత టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే బిర్యానీ తిన్న తర్వాత టీ తాగకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీ తాగడం వలన బిర్యానీలోని ఐరన్ శోషణ తక్కువవుతుంది. అంతేకాకుండా టీ వల్ల జీర్ణవ్యవస్థలో అసిడిటీ పెరిగే అవకాశం ఉంది.

ఫైనల్ గా…

బిర్యానీ తిన్న తర్వాత, కనీసం రెండు గంటలు పెరిగిన జీర్ణక్రియ కోసం శరీరానికి విశ్రాంతిని ఇవ్వాలి. తేలికపాటి గోరువెచ్చని నీరు తాగాలి. తినే ప్రతి ఆహారం, పానీయంపై అవగాహన పెంచుకుంటేనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రుచి కోసం తీసుకునే చిన్న పొరపాట్లు, తర్వాత పెద్ద ఆరోగ్య సమస్యలుగా మారకముందే జాగ్రత్తపడాలి.

Read more Photos on
click me!

Recommended Stories