Chiken Feet: చాలా మందికి చికెన్ అంటే ఇష్టం. అయితే చికెన్‌లో ప్రత్యేకంగా కోడి కాళ్లు అంటే కొందరికి ఫేవరెట్. చికెన్ లెగ్స్‌తో చేసిన వంటలకు మంచి డిమాండ్ ఉంది. మరి కోడి కాళ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా? వాటిలో పోషకాలు ఉంటాయా?
కోడి కాళ్లలో కొల్లాజెన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో చర్మం, ఎముకలు, కీళ్ల ఆరోగ్యానికి పనిచేస్తుంది. వయసు పెరిగే కొద్దీ శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గుతుంది. అందుకే కొల్లాజెన్ ఉన్న ఫుడ్ తీసుకోవాలని డాక్టర్లు చెబుతారు. కోడి కాళ్లతో చేసిన సూప్ లేదా కూర తినడం వల్ల శరీరానికి కొల్లాజెన్ అందుతుందని చెబుతున్నారు.
25
ఎముకల బలానికి బెస్ట్ మెడిసిన్
కోడికాళ్లలో ఇందులో కాల్షియం, మాగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యలు ఉన్నవారికి కోడి కాళ్ల సూప్ బాగా పనిచేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అలాగే శరీరానికి ఎనర్జీ ఇస్తుంది.
35
జుట్టు, గోర్లు, చర్మానికి మంచిదంట
చర్మ ఆరోగ్యానికి కూడా కోడి కాళ్లు మంచిదేనంట. కొల్లాజెన్ కారణంగా స్కిన్ టైట్ అవుతుంది. అందుకే కొంతమంది బ్యూటీ డైట్‌లో కూడా చికెన్ బోన్ బ్రోత్‌ను చేర్చుకుంటున్నారు. జుట్టు, గోర్లు బలంగా ఉండేందుకు కూడా ఇందులోని పోషకాలు సహాయపడతాయని చెబుతున్నారు.
అయితే కోడి కాళ్లు తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. శుభ్రంగా కడగకుండా వాడితే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఉంటుంది. కాబట్టి బాగా శుభ్రం చేసి, పూర్తిగా ఉడికించిన తర్వాత మాత్రమే తినాలి.
55
పరిమితంగా తీసుకోవాలి
అలాగే ఎక్కువ మసాలాలు, ఆయిల్ వేసి ఫ్రై చేసి తీసుకుంటే ఆరోగ్య సమస్యలు రావచ్చు. హై కొలెస్ట్రాల్, బీపీ లేదా హార్ట్ సమస్యలు ఉన్నవారు పరిమితంగా మాత్రమే తీసుకోవడం మంచిది. సరైన మోతాదులో తింటే పోషకాలు పొందుతారు. క్లీనింగ్, వండే విధానం, తినే పరిమాణం సరిగ్గా ఉంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే.