చాలా మంది ఒకేసారి 2 ,3 కేజీల మాంసం తెచ్చి ఫ్రిజ్ లో స్టోర్ చేస్తారు. కానీ పచ్చి మాంసంలో బాక్టీరియా తొందరగా పెరుగుతుంది. అందుకే సరైన పద్దతిలో నిల్వ చేయడం చాలా ముఖ్యం.
Image credits: Getty
Telugu
పచ్చి మాంసం (చికెన్ లేదా మటన్)
పచ్చి మాంసాన్ని ఫ్రిజ్లో 1 నుంచి 2 రోజులు మాత్రమే ఉంచాలి. అంతకంటే ఎక్కువ రోజులు ఉంచితే చెడు వాసన రావడం మొదలవుతుంది.
Image credits: Getty
Telugu
ఉడికించిన మాంసం
వండిన మాంసాన్ని ఫ్రిజ్లో 3-4 రోజుల వరకు ఉంచి తినొచ్చు. కానీ వీలైనంత వరకు తాజాగా ఉన్నప్పుడే తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.
Image credits: Getty
Telugu
శుభ్రపరచడం ముఖ్యం
మాంసం తెచ్చిన వెంటనే బాగా కడిగి, నీళ్లు లేకుండా ఆరబెట్టాలి. తేమ ఉంటే బ్యాక్టీరియా వేగంగా వ్యాపిస్తుంది.
Image credits: Getty
Telugu
ఎయిర్-టైట్ బాక్సులో పెట్టాలి
గాలి చొరబడని డబ్బాల్లో మాంసాన్ని పెట్టి ఫ్రీజర్లో ఉంచాలి. ఫ్రీజర్లోని ఉష్ణోగ్రత -18°C కంటే తక్కువగా ఉంటే చాలా మంచిది. ఫ్రీజ్ చేస్తే మాంసం ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
Image credits: Getty
Telugu
లేబుల్ అతికించండి
మాంసాన్ని ఫ్రిజ్లో పెట్టిన తేదీని ఒక చీటీపై రాసి, డబ్బా మీద అంటించాలి. దీనివల్ల అది ఎన్ని రోజుల కిందటిదో సులభంగా తెలుస్తుంది.